Kiriti Shetty | మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ‘కల్కి’లో మెరిసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్‌ను కాపాడే యోధుడి పాత్రలో కనిపించాడు. కనిపించింది కొద్దిసేపే అయిన గుర్తుండిపోయే పాత్రను పోషించాడు. అయితే దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం ‘లక్కీ భాస్కర్’తో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. సార్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం అనంతరం దుల్కర్ తమిళ దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.
తమిళ దర్శకుడు సెల్వమని సెల్వరాజ్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని దుల్కర్ చేయబోతున్నట్లు సమాచారం. ఆ సినిమాలో దుల్కర్‌కి జోడీగా ఉప్పెన భామ కృతి శెట్టిని ఒకే చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుని టాలీవుడ్ హీరో రానా నిర్మించడంతో పాటు ఈ మూవీలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి..