Kalinga | కిరోసిన్ ఫేం ధ్రువ వాయు పాన్ ఇండియా ప్రాజెక్టు కళింగ (Kalinga)తో వస్తున్నాడని తెలిసిందే. స్వీయదర్శకత్వంలో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. బాలిక ఒళ్లు గగుర్పొచేలా తన చెవిని తానే కొరుక్కుని తినే సన్నివేశంతో మొదలైన టీజర్ యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగుతూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.
ఈవెంట్ ధ్రువ వాయు మాట్లాడుతూ.. పోస్టర్, టీజర్ విడుదల చేసిన తర్వాత కళింగ సినిమాపై హైప్ పెరిగిపోయింది. కంటెంట్‌కు వస్తున్న స్పందనతో ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో బిజినెస్ డీల్స్ నిలిచిపోయాయి. ఇది రెగ్యులర్ సినిమా కాదని, ఎమోషన్స్, లవ్, కామెడీ, హార్రర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో సాగుతుందన్నాడు. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో ఇలాంటి కాన్సెప్ట్‌ను రాలేదన్నాడు. సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుందని నమ్మకంతో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.
ఈ చిత్రంలో కీ పోర్షన్ అవుట్ డోర్, ఫారెస్ట్ లొకేషన్లలో చిత్రీకరించాం. సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రతీ ఒక్కరూ చూడాలని నిర్మాత పృథ్వియాదవ్ అన్నారు. ఈ మూవీలో ప్రగ్యా నయన్ హీరోయిన్గా నటిస్తుండగా.. మురళీ ధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, తనికెళ్లభరణి, బలగం సుధాకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి విష్ణు శేఖర, అనంత నారాయణన్ ఏజీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీని బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి కొండవీటి, పృథ్వియాదవ్ తెరకెక్కిస్తున్నారు.
#Kalinga arriving worldwide in cinemas on September 13thhttps://t.co/UXrPWz2gxD
Telugu, Tamil, Kannada, Malayalam, Hindi#BigHitProductions pic.twitter.com/7OdhNhUlv5
— Vamsi Kaka (@vamsikaka) August 26, 2024
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్ మారథాన్ షెడ్యూల్ షురూ.. ఎక్కడంటే..?
Priyadarshi | సారంగపాణి జాతకం సెట్స్‌లో కేక్ కట్ చేసిన ప్రియదర్శి.. స్పెషల్ ఇదే
Game Changer | ఫైనల్‌గా రాంచరణ్ గేమ్‌ఛేంజర్ విడుదల తేదీపై క్లారిటీ.. ఎప్పుడో తెలుసా..?
Saripodhaa Sanivaaram | సరిపోదా శనివారం ప్రీ సేల్స్.. నాని తన రికార్డు తానే బ్రేక్ చేస్తాడా..?
కళింగ టీజర్..