Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). శివ (siva) దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోన్న కంగువలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. కాగా తాజాగా నిర్మాత కేఈ జ్ఞానవేళ్ రాజా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్ ప్రేక్షకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కోలీవుడ్ ప్రేక్షకులు కానీ మీడియా కానీ తెలుగు హీరోలను హీరోలు లాగానే చూస్తారు. కానీ తెలుగు ప్రేక్షకులు తమిళ హీరోలను మాత్రం మా హీరోలుగా చూస్తారు. రజినీ కాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ, విక్రమ్, విజయ్ దళపతి, విజయ్ సేతుపతి తదితర హీరోలందరని తెలుగులో మన హీరోలు అని ఓన్ చేసుకుంటారు. అది చాలా నచ్చుతుంది. అందుకే తెలుగు ప్రేక్షకులకు మిగత ప్రేక్షకులకు చాలా తేడా కనిపిస్తుందని చెప్పుకోచ్చాడు.
కంగువను స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ౩డీ ఫార్మాట్లో కూడా సందడి చేయనుంది కంగువ. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Also Read..