The Birthday Boy | ప్రాణం తీసిన బర్త్‌డే బంప్స్.. ఆసక్తికరంగా ‘ది బర్త్‌డే బాయ్’ ట్రైలర్
The Birthday Boy | ఇటీవల రొటిన్ కథలకు కాలం చెల్లింది. అందుకే ఇప్పుడు కొత్త వాళ్లు కొత్త కంటెంట్‌తో వైవిధ్యమైన అప్రోచ్‌తో సినిమాలు తీస్తూ కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అదే కోవలో మరో విభిన్నమైన ఎంటర్టైనర్ రాబోతుంది.
The Birthday Boy | ఇటీవల రొటిన్ కథలకు కాలం చెల్లింది. అందుకే ఇప్పుడు కొత్త వాళ్లు కొత్త కంటెంట్‌తో వైవిధ్యమైన అప్రోచ్‌తో సినిమాలు తీస్తూ కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అదే కోవలో మరో విభిన్నమైన ఎంటర్టైనర్ రాబోతుంది. రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది బర్త్‌డే బాయ్’ (The Birthday Boy). బొమ్మ బొరుసా పతాకంపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి విస్కి దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను జూలై 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఎం.ఎస్ చదవడానికి విదేశాలకు వెళ్లిన ఐదుగురు చిన్ననాటి స్నేహితులకు అక్కడ జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.. ఒక బర్త్ డే పార్టీలో తన స్నేహితుడికి బర్త్ డే బంప్స్ (పుట్టినరోజు నాడు చేసే సరదా పని) ఇద్దామని ప్లాన్ చేసిన స్నేహితులు అనుకోకుండా అతడి చావుకి కారణం అవుతారు. అయితే ఈ క్రమంలో అక్కడ జరిగిన సంఘటనలు ఏమిటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
యదార్థ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ సినిమా సహజత్వం కోసం సింక్ సౌండ్ వాడాం. కంటెంట్‌తో పాటు మంచి టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రం వుండబోతుంది. ఒక మంచి క్వాలిటీ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నించాం. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది అంటూ దర్శకుడు వెల్లడించాడు.
రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల, ప్రమోదిని, వాకా మని, రాజా అశోక్, వెంకటేష్, సాయి అరుణ్, రాహుల్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఐ.భరత్, డీఓపీ : సంకీర్త్ రాహుల్, సంగీతం: ప్రశాంత్ శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఆర్ వంశీ.జి, ఎడిటర్: నరేష్ ఆడుపా, సింక్ సౌండ్ డిజైన్: సాయి మణిధర్ రెడ్డి, సౌండ్ మిక్సింగ్: అరవింద్ మీనన్, మేకప్ చీఫ్: వెంకట్ రెడ్డి, డిజిటల్ మార్కెటింగ్: ఫస్ట్ షో, పీఆర్ ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు.
Also read..
-
Shalini Pandey | కిర్రాక్ పోజులతో మతి పోగొడుతున్న షాలిని పాండే
-
Nabha Natesh | శభాష్ నభా నటేష్.!
-
lavanya | రాజ్‌తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు.. లావణ్య కేసులో మరో ట్విస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

