Nabha Natesh | శభాష్ నభా నటేష్.!
Nabha Natesh | అనుకున్నది సాధించాలనే సంకల్పం వుంటే.. ఎంతటి కష్టాలు ఎదురైనా తమ లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని నిరూపించారు తెలుగు కథానాయిక నభా నటేష్. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నభా నటేష్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.
Nabha Natesh | అనుకున్నది సాధించాలనే సంకల్పం వుంటే.. ఎంతటి కష్టాలు ఎదురైనా తమ లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని నిరూపించారు తెలుగు కథానాయిక నభా నటేష్. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నభా నటేష్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ సినిమా ఘన విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ భామకు చాలా ఆఫర్లు వెల్లువెత్తాయి.
అయితే ఉన్నట్లుండి ఈ ముద్దుగుమ్మ గత ఏడాది నుండి కనపడకుండాపోయింది. ఏ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా లేదు. దీంతో నభాకు ఏమైందని నెట్టింట చర్చలు జరిగాయి. తాజాగా ఈ విషయంపై నటి నభా స్పందించింది. తాను సినిమాలకు దూరంగా ఉండటానికి కారణం, తనకు ఓ పెద్ద యాక్సిడెంట్ జరిగిందని తెలిపింది. ఆ ప్రమాదం కారణంగా గత ఏడాది తనకు చాలా కఠినంగా సాగిందని.. తన ఎడమ భుజానికి తీవ్రంగా గాయమైందని పేర్కొంది. మల్టీఫుల్ బోన్ ఫ్రాక్చర్ జరిగాయి.అంతే కాకుండా కొన్ని కంప్లికేటెడ్ సర్జరీలు జరిగాయి అని నభా నటేష్ తెలిపారు.
యాక్సిడెంట్ జరిగినప్పుడు తన మానసికి పరిస్థితి ఎలా ఉందో వివరించింది. చాలా సర్జరీలు జరిగాయని, ఊహించని శారీరక మానసిక బాధను అనుభవించిందని తెలిపింది. కెరీర్ చాలా పీక్స్‌లో ఉన్నప్పుడే ప్రమాదానికి గురవ్వడం జరిగింది. ఓ రకమైన మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయానని తను పేర్కొంది. గాయం నుంచి కోలుకోని మళ్లీ సినిమాలు చేయడం అంత సులువైన విషయం కాదని నభా నటేష్ పేర్కొన్నారు.
అయితే తను ప్రమాదం నుంచి తేరుకొని మళ్ళీ తెరపైన అంతే ఎనర్జిటిక్ గా కనిపించడం చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. నభా నటేష్ ఫిట్నెస్ సాధించి `డార్లింగ్` అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది తనకు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది. ఏదైన ప్రమాదం జరిగినప్పుడు కుంగి పోకుండా నభా నటేష్ తేరుకున్నతీరు చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. `శభాష్ నభా నటేష్ తన పట్టుదల, అంకిత భావంతో ఆమె అనుకున్నది సాధించింది.
Also Read..
-
lavanya | రాజ్‌తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు.. లావణ్య కేసులో మరో ట్విస్ట్
-
Gutha Sukhender Reddy | విభజన సమస్యలపై పంతాలకు పోకుండా.. శాశ్వత పరిష్కారం చేసుకోవాలి : గుత్తా సుఖేందర్ రెడ్డి
-
Isha Ambani | అనంత్ పెళ్లి వేడుకల్లో బంగారు జడతో మెరిసిపోయిన ఈషా అంబానీ.. సౌత్ ఇండియన్ టచ్‌తో కేశాలంకరణ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

