Vaadi Vaasal | కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran), స్టార్ హీరో సూర్య (Suriya) కాంబినేషన్లో సినిమా రాబోతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సూర్యతో వాడివాసల్ (Vaadi Vaasal) సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వెట్రిమారన్. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందంటూ.. ఎదురుచూస్తున్న అభిమానులకు విడుతలై పార్టు 2 సినిమా పూర్తయిన వెంటనే సూర్య సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తామని గుడ్ న్యూస్ కూడా చెప్పాడు.
తాజాగా నిర్మాత కలైపులి ఎస్ థాను ఆసక్తికర అప్డేట్ ఇచ్చి మూవీ లవర్స్‌లో జోష్ నింపారు. వాడివాసల్ ప్రాజెక్ట్ గురించి మీడియాతో మాట్లాడుతూ.. జులై 5న నేను, సూర్య, వెట్రిమారన్ సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని చర్చించాం. ప్రస్తుతం లండన్‌లో యానిమేషన్ వర్క్ కొనసాగుతోంది. పాపులర్ ప్రాజెక్ట్ జురాసిక్ పార్క్‌కు పనిచేసిన టీం ఈ చిత్రానికి పనిచేస్తుంది. సినిమా తప్పకుండా వస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడీ కామెంట్స్ సూర్య అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి.
మొత్తానికి హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నాడని అర్థమైపోవడంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. వెట్రిమారన్ ప్రస్తుతం సూరి, విజయ్ సేతుపతి లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన సీక్వెల్ విడుతలై పార్టు-2ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. చిత్రీకరణ దశలో ఉన్న రెండో పార్టుకు సంబంధించిన లుక్ కూడా విడుదల చేసి సీక్వెల్‌పై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాడు వెట్రిమారన్.
“On July 5th Me, #Suriya & #Vetrimaaran together have discussed on how we are going to take #VaadiVaasal🐂. Currently the Animatronics work is going on London with the company who did for Jurassic park🔥. The movie will happen for sure💯”
– Producer Thanupic.twitter.com/C8pIyGihTY— AmuthaBharathi (@CinemaWithAB) August 19, 2024
Priyadarshi | ప్రియదర్శి నెక్ట్స్ సినిమా టైటిల్‌పై సమ్మోహనం మేకర్స్ క్లారిటీ
Stree 2 | 4 రోజుల్లోనే రికార్డ్ వసూళ్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న శ్రద్దాకపూర్ స్త్రీ 2
World Of Vasudev | కిరణ్ అబ్బవరం క నుంచి వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్