Jr NTR | టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన తల్లి శాలినితో కలిసి ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్నాడని తెలిసిందే. నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్న మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరిందంటూ తారక్ ఇప్పటికే ఎక్స్ ద్వారా అందరితో షేర్ చేసుకున్నాడు. అనంతరం సాయంకాల సమయంలో తారక్ అండ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) బీచ్లో సరదా టైంను ఎంజాయ్ చేశారు.
కుందాపుర బీచ్లో తారక్, నీల్ తమ సతీమణులతో కలిసి దిగిన ఫొటోను నెట్టింట షేర్ చేసుకున్నారు. ఇప్పుడీ స్టిల్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. తారక్తోపాటు నటుడు రిషబ్ షెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ శ్రీకృష్ణ మఠంను దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో ఎన్టీఆర్ 31 సినిమా రాబోతుందని తెలిసిందే. ప్రస్తుతం దేవర సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు తారక్. మరోవైపు సలార్ 2తో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్.
Nayan Sarika | సౌతిండియన్ను కాదని తెలిసి అల్లు అర్జున్ షాకయ్యారు.. ఆయ్ భామ నయన్ సారిక
Devara | తారక్-జాన్వీకపూర్ మాస్ డ్యుయెట్.. దేవర థర్డ్ సాంగ్ ఇదే
Kanguva | ఆ వార్తలే నిజమయ్యాయి.. కంగువ వాయిదాపై సూర్య క్లారిటీ