Sai Tej | బ్రేకప్‌పై సాయి ధరమ్ తేజ్ సరదా కామెంట్స్ వైరల్ .. హీరోయిన్ ఎవరోనంటూ నెటిజన్ల ఆరా
Sai Tej | మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా చేసిన బ్రేకప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. యంగ్ హీరో సుహాస్ నటిస్తున్న తాజా చిత్రం హే భగవాన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న తేజు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక సరదా వ్యాఖ్యతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఈవెంట్లో దర్శకుడు రామ్ అబ్బరాజు కూడా హాజరుకావడంతో స్టేజ్‌పై జరిగిన సంభాషణ మరింత వినోదంగా మారింది.
Sai Tej | మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా చేసిన బ్రేకప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. యంగ్ హీరో సుహాస్ నటిస్తున్న తాజా చిత్రం హే భగవాన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న తేజు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక సరదా వ్యాఖ్యతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఈవెంట్లో దర్శకుడు రామ్ అబ్బరాజు కూడా హాజరుకావడంతో స్టేజ్‌పై జరిగిన సంభాషణ మరింత వినోదంగా మారింది. తేజు మాట్లాడుతూ తన లవ్ స్టోరీ బ్రేకప్ కావడానికి కారణం రామ్ అబ్బరాజునేనని నవ్వుతూ చెప్పడంతో ఆడిటోరియంలో నవ్వులు పూశాయి. రామ్ అబ్బరాజు కూడా అదే సరదా టోన్‌లో స్పందిస్తూ “ఆవిడ ఒక హీరోయిన్… ఆమె భాష కూడా మాకు రాదు” అంటూ హింట్ ఇవ్వడంతో అక్కడ ఉన్నవాళ్లు కాసేపు షాక్ అయ్యి వెంటనే నవ్వుల్లో మునిగిపోయారు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం, చనువు ఈ సంభాషణలో స్పష్టంగా కనిపించింది.
రామ్ అబ్బరాజు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచే సాయి ధరమ్ తేజ్‌తో పరిచయం ఉండటంతో, ఈ జోకులు పూర్తిగా ఫ్రెండ్లీ వాతావరణంలోనే జరిగినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ తేజు చెప్పిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. “అసలు ఆ హీరోయిన్ ఎవరు?” అనే ప్రశ్న ఇప్పుడు నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం నలభై ఏళ్లకు చేరుకున్న సాయి ధరమ్ తేజ్ ఇంకా వివాహం చేసుకోకపోవడం కూడా ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. గతంలో ఆయనపై వచ్చిన కొన్ని రూమర్లు మళ్లీ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు పూర్తిగా సరదా కోణంలో చెప్పినవేనని ఆయన అభిమానులు అంటున్నారు.
ఏదేమైనా ఒక సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జరిగిన ఈ చిన్న కామెడీ సంభాషణ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తేజు స్టేజ్‌పై చేసిన ఒకే ఒక్క జోక్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిబేట్‌గా మారడం విశేషమే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Wake Up Stroke | వేక్-అప్ స్ట్రోక్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఏం చేయాలి..?
Dead Bodies | ప్రకాశం జిల్లాలో కలకలం..బీచ్‌కు కొట్టుకువచ్చిన నాలుగు మృతదేహాలు
Health tips | నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా.. అయితే ఉదయాన్నే ఈ పని చేయండి..!
Kodangal | కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌లో వలస కూలీల తిరుగుబాటు.. నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు
Miss behave | బాలికకు బొమ్మలిస్తానని నమ్మించి అసభ్య ప్రవర్తన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

