Jr NTR | టాలీవుడ్ యంగటైగర్ సోలో సినిమా థియేటర్లో విడుదలవ్వక 6 సంవత్సరాలు అవుతుంది. అప్పుడెప్పుడో అరవింద సామెత వీర రాఘవ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ సోలోగా వచ్చిన మూవీ లేదు. ఆర్ఆర్ఆర్ వచ్చిన అది కూడా మల్టీ స్టారర్ కావడంతో ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో సంతృప్తి చేందలేదు. దీంతో నందమూరి అభిమానుల ఆశలన్నీ దేవర సినిమాపైనే ఉన్నాయి. తారక్‌కు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన శివ కొరటాల దర్శకత్వంలో దేవర చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. అయితే ఈ సినిమా అనంతరం తారక్ సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో డ్రాగన్ సినిమా చేయనున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు కాకుండా తారక్‌తో మరో క్రేజీ కాంబో తెరపైకి వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
నానికి హాయ్ నాన్న వంటి క్లాసిక్ హిట్‌ను అందించిన దర్శకుడు శౌర్యువ్ తన తదుపరి చిత్రం ఎన్టీఆర్‌తో చేయబోతున్నట్లు ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై తాజాగా దర్శకుడు శౌర్యువ్ స్పందించారు. ఆ వార్తలలో ఏమాత్రం నిజం లేదని పేర్కొన్నారు.
తారక్‌తో నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటూ కొన్ని రోజులుగా వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఇది ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్. ఈ రూమర్ ఎక్కడ నుంచి వచ్చిందో నాకు కూడా తెలియదు. అయితే ఇది ఎలా వచ్చిన ఈ రూమర్ నిజం కావలని నేను కూడా కోరుకుంటున్నా. నా జీవితంలో ఏదో ఒకరోజు తారక్‌తో సినిమా తీయాలని అనుకుంటున్నాను అంటూ శౌర్యువ్ వెల్లడించారు.
ALso Read..
All Party Meet | సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ
Justice BR Gavai: ఎస్సీల్లో క్రిమీలేయర్‌ను గుర్తించే విధానాన్ని రూపొందించాలి: జస్టిస్ గవాయి