అభిమానుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పుటికపుడు మేకోవర్ మార్చుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచే హీరోల్లో టాప్‌లో ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). సినిమాలతో ఎంటర్టైన్ చేయడమే కాదు.. ఆఫ్ స్క్రీన్ లుక్‌లో కూడా అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తుంటాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ జపాన్ రిలీజ్ సందర్భంగా ట్రెండీ స్టైలిష్ లుక్‌లో కనిపించి ఔరా అనిపించాడు. తాజాగా ఎవరూ ఊహించని లుక్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాడు ఎన్టీఆర్.
స్టైలిష్ క్రాఫ్, గడ్డం, గాగుల్స్ తో జీన్స్ ట్రౌజర్ వేసుకుని కెమెరాకు ఫోజులిచ్చాడు తారక్. ఎన్టీఆర్ అద్దంలో తనను తాను చూసుకుంటుంటే.. వెనకనున్న వ్యక్తి ఆ దృశ్యాన్ని సెల్లో బంధించే ప్రయత్నిస్తున్నాడు. కొత్త రోజు, కొత్త వైబ్స్ అనే క్యాప్సన్ తో తారక్ న్యూ లుక్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ 30 (NTR 30) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా కోసం తారక్ మేకోవర్ మార్చుకునే పనిలో ఉన్నట్టు ఇప్పటికే చాలా వార్తలు తెరపైకి వచ్చాయి. మరి తారక్ న్యూ లుక్ ఎన్టీఆర్ 30 కోసమేనా..? లేదంటే కమర్షియల్ యాడ్ కోసమా..? అనేది తెలియాల్సి ఉంది.
NTR @tarak9999 on Instagram :
“A new day, a new vibe… and Aalim at it again…” pic.twitter.com/6tKHA2Gxko
— BA Raju's Team (@baraju_SuperHit) November 11, 2022
Read Also : Yashoda | సక్సెస్‌తో యశోద టీంలో జోష్.. ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫాం ఫిక్స్
Read Also : Jr NTR | జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ అదిరిందంతే.. స్పెషలేంటో మరి..!
Read Also : Dhamaka | రవితేజ ధమాకా నుంచి వాట్స్ హ్యాపెనింగ్ లిరికల్ సాంగ్.. వీడియో