Devara Second Single | తెలుగు ప్రేక్షకులతోపాటు గ్లోబర్వైడ్గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం దేవర (Devara). టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో ఒకటైన ఈ చిత్రంలో టైటిల్లో రోల్లో నటిస్తున్నాడు. కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. పార్టు 1 సెప్టెంబర్27 న గ్రాండ్‌గా విడుదల కానుంది.
దేవర నుంచి ఇప్పటికే అనిరుధ్ రవిచందర్ కంపోజిషన్‌లో లాంచ్ చేసిన ఫియర్ సాంగ్ (Fear Song)తోపాటు గ్లింప్స్ నెట్టింట మిలియన్లకుపైగా వ్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ చిత్రంతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ (Janhvi Kapoor) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మ్యూజిక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెలోడీ ట్రాక్ లుక్ ఇప్పటికే ఆన్లైన్లో వైరల్ అవుతుండగా.. ఈ పాటను రేపు సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. తారక్, జాన్వీ అభిమానులకు విజువల్ ట్రీట్‌లా సాంగ్ ఉండబోతున్నట్టు ఈ లుక్ చెప్పకనే చెబుతోంది.
శంషాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్లో జాన్వీకపూర్, తారక్, ఇతర ఆర్టిస్టులపై వచ్చే భారీ సాంగ్‌ను కొరటాల శివ అండ్ టీం షూట్ చేస్తున్నట్టు ఇప్పటికే ఓ వార్త తెరపైకి వచ్చిందని తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
సాంగ్ లాంచ్ అప్డేట్ లుక్..
A breezy melody drops at 5:04PM tomorrow to rule your playlists for a very long time.❤️🦋#DevaraSecondSingle
An @AnirudhOfficial Musical 🎶
🎙️- @ShilpaRao11, @DeepthiSings
✍️ – @Ramjowrites, @KausarMunir, @Vigneshshivn, @Aazad_Varadaraj, #MankombuGopalakrishnan
🕺-… pic.twitter.com/9ppJJAwZsB— NTR Arts (@NTRArtsOfficial) August 4, 2024
Shivam Bhaje | గూస్బంప్స్ తెప్పించేలా శివం భజే.. డైరెక్టర్ అప్సర్పై నెటిజన్ల ప్రశంసలు
Veera Dheera Sooran | విక్రమ్, అరుణ్‌కుమార్ వీరధీరసూరన్ టీం విషెస్.. స్పెషల్ ఇదే..!
Malavika Mohanan | బర్త్ డే స్పెషల్.. ప్రభాస్ రాజాసాబ్ సెట్స్‌లో మాళవిక మోహనన్