Jr. NTR | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఆయన ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీకి ఇంకా వారం రోజులే ఉండడంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు తారక్. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న తారక్ తనకు ఒక చిన్న సినిమా చేయాలని ఉంది అని మనసులోని మాటను బయటపెట్టాడు.
నాకు తక్కువ బడ్జెట్లో ఒక చిన్న సినిమా చేయాలని ఉంది. 40 రోజుల్లోనే ఆ మూవీ షూటింగ్ అయిపోవాలి. కథ నచ్చి అవసరమైతే ఆ సినిమాను నేను నిర్మించడానికి రెడీగా ఉన్నాను. కానీ ఎప్పటికైనా కచ్చితంగా చేసి తీరతాను అంటూ తారక్ చెప్పుకోచ్చాడు.
Also Read..