ముంబై: ఒక వాహనం నిలిచి ఉన్న పేవ్మెంట్ ఉన్నట్టుండి కుంగిపోయింది. అక్కడ ఏర్పడిన భారీ గుంతలో ఆ వాహనం పడింది. అందులో ఉన్న డ్రైవర్ బయటకు దూకి క్షేమంగా బయటపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Vehicle Falls Into Huge Sinkhole) మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరగింది. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో పూణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ)కు చెందిన సెప్టిక్ ట్యాంక్ వాహనం సమాధాన్ చౌక్‌లోని సిటీ పోస్ట్ ఆవరణలో నిలిచి ఉంది. అక్కడి టాయిలెట్‌ను క్లీన్ చేసింది. అనంతరం వాహనాన్ని నడిపేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. సెప్టిక్ ట్యాంకర్ కాస్త ముందుకు కదలగానే అక్కడి భూమి కుంగిపోయింది. దీంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆ వాహనంలో అందులో పడిపోయింది. వెంటనే స్పందించిన డ్రైవర్ వాహనం నుంచి బయటకు దూకి సురక్షితంగా బయటపడ్డాడు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న అధికారులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్ద గోతిలో పడి చిక్కుకున్న ఆ వాహనాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు బైక్‌లు కూడా ఆ
గుంతలో పడ్డాయని అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అన్నారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#WATCH | Maharashtra | A truck fell upside down in the premises of the city post office in the Budwar Peth area of Pune city after a portion of the premises caved in. The truck belongs to the Pune municipal corporation and was there for drainage cleaning work.
20 Jawans of the… pic.twitter.com/YigRhM5iwS
— ANI (@ANI) September 20, 2024
#WATCH | Pune: PMC Truck Falls Into Pit; Driver Safe
Read story by Ankit Shukla (@AnkitShukla5454): https://t.co/pvaMLOvijJ#PuneNews #Maharashtra pic.twitter.com/FL9OG6L18v
— Free Press Journal (@fpjindia) September 20, 2024