War 2 | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) బాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ వార్ 2 (War 2). బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) మరో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం స్పై జోనర్లో తెరకెక్కుతుండగా.. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట రౌండప్ చేస్తూ హైప్ పెంచేస్తుంది. ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో వచ్చే స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌పై వచ్చే పాట విడుదల ప్లాన్‌లో మార్పులు చేసిందట యూనిట్. తాజా టాక్ ప్రకారం వార్ 2 స్పెషల్ సాంగ్‌ను సినిమా విడుదలకు కేవలం ఓ వారం ముందు లాంచ్ చేయనున్నారని బీటౌన్ సర్కిల్ ఇన్సైడ్ టాక్.
కొన్ని రోజుల క్రితం ఈ స్పెషల్ సాంగ్‌ను ట్రైలర్ కంటే ముందే లాంచ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ తాజా టాక్ ప్రకారం ముందు ట్రైలర్ ఆ తర్వాత స్పెషల్ సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. యశ్ రాజ్ ఫిలింస్ ఈ సాంగ్ ఎలా ఉండబోతున్నది మాత్రం సస్పెన్స్‌లో పెట్టేసి క్యూరియాసిటీ పెంచేస్తుంది. తారక్, హృతిక్ రోషన్ డ్యాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి ట్రైలర్ తర్వాత రాబోయే స్పెషల్ సాంగ్ ఏ రేంజ్లో ఉండబోతుందోనని అప్పుడే అంచనాలు భారీగానే పెట్టుకున్నారు మూవీ లవర్స్, అభిమానులు.
వార్ 2 YRF Spy Universeలో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 సినిమాల తర్వాత వస్తున్న ఆరో సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Manchu Vishnu | రామాయణంపై దృష్టి పెట్టిన మంచు విష్ణు.. రావణుడిగా మోహన్ బాబు, రాముడిగా?