Devara | గ్లోబల్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ రోల్లో నటించిన చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ మరోవైపు నవంబర్ 8 నుంచి ఓటీటీలో కూడా సందడి చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమా ఖాతాలో అరుదైన ఫీట్ చేరింది. దేవర ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ అత్యధిక మంది వీక్షించిన రెండో సౌతిండియా సినిమాగా నిలిచింది. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్ చార్ట్స్‌లో ఐదో వారంలో కూడా ట్రెండింగ్ అవుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటించగా.. ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కించారు.
Akhanda 2 | అఖండ 2 వచ్చేది అప్పుడే.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న బాలకృష్ణ టీం రిలీజ్ డేట్ ప్రోమో
Manchu Manoj | నా తల్లి ఆస్పత్రిలో లేదు.. మాట్లాడుకోవడానికి సిద్ధం : మంచు మనోజ్