Devara | టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు పార్టులుగా రానుండగా..దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
నార్త్ అమెరికాలో దేవర ప్రీ సేల్స్‌లో 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటినట్టు ఇప్పటికే వార్త వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రీ సేల్స్ మరింత పెరిగిపోయాయి. ఎర్ర సముద్రం సునామీగా మారుతుంది.. నార్త్ అమెరికాలో ప్రీమియర్ ప్రీ సేల్స్ అంటూ 2.5 మిలియన్ డాలర్లు అంటూ కొత్త వార్తను అందరితో షేర్ చేసుకున్నారు మేకర్స్. ఇప్పుడీ అప్డేట్ తెలియడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో వస్తున్న దేవరతో ..ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీ సేల్స్ విషయంలో ప్రభాస్ తర్వాత వరుసగా రెండు సినిమాల (సలార్, కల్కి 2898 ఏడీ)తో ఈ ఫిగర్‌ను దాటిన తొలి భారతీయ నటుడిగా అదిరిపోయే ఫీట్‌ను సొంతం చేసుకున్నాడు తారక్. మరోవైపు రక్తంతో సముద్రమే ఎరుపెక్కిన కథ.. మా దేవర కథ.. అంటూ యాక్షన్ పార్టుతో సాగుతున్న ట్రైలర్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.
దేవరలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
North America can’t contain the fury of #Devara ❤️🔥
&
The Red Sea is turning into a full blown tsunami 🤙🏻$2.5 MILLION+ Premieres Pre sales and the heat is rising! 🔥🔥#DevaraUSA by @PrathyangiraUS & @Hamsinient pic.twitter.com/EofezaPMI8
— BA Raju’s Team (@baraju_SuperHit) September 26, 2024
Hanu Man | బాహుబలి, ఆర్ఆర్ఆర్ రూట్లో తేజ సజ్జా హనుమాన్.. ప్రశాంత్ వర్మ కొత్త పోస్టర్ వైరల్
Prakash Raj | చేయని తప్పుకి సారీ.. హాట్ టాపిక్‌గా ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్
Devara Movie | ‘దేవర’ టికెట్ ధరలు.. నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్.!