Jr NTR | దివంగత లెజెండరీ నటుడు నందమూరి తారకరామారావు మనవడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి.. జూనియర్ ఎన్టీఆర్‌గా సిల్వర్ స్క్రీన్‌పై తనదైన స్టాంప్ వేసుకున్నాడు తారక్. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన తారక్ నిన్ను చూడాలని సినిమాతో సోలో హీరోగా మారాడని తెలిసిందే. ఈ మూవీ విడుదలై పాతికేళ్లు దాటిపోయింది. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే తారక్ హీరోగా తొలిసారి కెమెరా ముందుకొచ్చింది ఈ రోజే.
నేటితో తారక్ కెమెరా ముందుకొచ్చి 25 సంవత్సరాలు పూర్తయింది. కామెడీ, క్లాస్, మాస్.. ఏ జోనర్ అయినా సరే తనకు తానే పోటీ అన్నట్టుగా సినిమాలు చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా ట్రాక్‌పై దూసుకెళ్తున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు. తన నటనతో ఖండాంతరాల్లో ఉన్న విదేశీ ప్రేక్షకులకు సైతం గూస్బంప్స్ తెప్పించాడు.
టాలీవుడ్‌తో జర్నీ మొదలుపెట్టి పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ సొంతం చేసుకుని.. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తూ నటుడిగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ అభిమానులకు వినోదాన్ని పంచడమే ధ్యేయంగా ముందుకెళ్తున్న తారక్ భవిష్యత్‌లో మూవీ లవర్స్, అభిమానులను ఎంటర్టైన్ చేయాలని.. మరిన్ని విజయాలు అందుకోవాలని విష్ చేస్తున్నారు.
Today, 25 years ago a man stepped in front of the camera for the first time for #NinnuChoodalani… and the rest is history 🔥
The MASSES were reborn through his presence and the MASS HYSTERIA he created set the tone for a legacy that continues in a stupendous way 💥… pic.twitter.com/v0PoH9tzy6
— BA Raju’s Team (@baraju_SuperHit) November 16, 2025
Akhanda 2 | నందమూరి అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. 3డీ ఫార్మాట్లో ‘అఖండ 2’
Rajkummar Rao | తల్లిదండ్రులైన బాలీవుడ్ స్టార్ దంపతులు
NBK 111 | బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబో రిపీట్.. ఈ నెలాఖరున కొత్త సినిమా ప్రారంభం!