జోసెఫ్ ప్రభు..ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది ఈ పేరు. జోసెఫ్ ప్రభు (Joseph Prabhu)షేర్ చేసిన పోస్ట్‌ను మూడు రోజుల తర్వాత నెటిజన్లు, జనాల కంట పడింది. ఇంతకీ ఎవరీ జోసెఫ్ అంటూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఆయనెవరనే దానిపై నెటిజన్లకు ఓ క్లారిటీ కూడా వచ్చింది. స్టార్ హీరోయిన్ సమంత (Samantha)తండ్రే జోసెఫ్ .
సమంత, తన మాజీ భర్త నాగచైతన్యతో ఉన్న వెడ్డింగ్ ఫొటోల(wedding pictures)ను షేర్ చేస్తూ..ఆ కథ ఇక లేదు..అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. పాత గోల్డెన్ డేస్‌ను గుర్తు చేసుకుంటూ..కొత్త కథను మొదలుపెట్టు అని పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక ఈ పోస్ట్ చూసిన సామ్ అభిమానులు ధైర్యంగా ఉండండి అంటూ సందేశాలు పంపుతున్నారు. ఎమోషన్స్ ను అధిగమించేందుకు చాలా సేపు కూర్చుండిపోయానని అన్నాడు.
అంతేకాదు జీవితంలో కొత్త కథను మొదలుపెట్టాలని కూతురు సమంతను అడుగుతున్నాడు. మొత్తానికి జోసెఫ్ ప్రభు ఇలా సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా తన కూతురును రెండో పెళ్లివైపు (second marriage) మళ్లేలా ప్రోత్సహిస్తున్నట్టు చెప్పకనే చెబుతున్నాడు. సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత సమంత-నాగచైతన్య పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వివాహమయ్యాక నాలుగేళ్ల తర్వాత 2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్టు ప్రకటించారు.
Read Also : Puri Jagannadh | పూరీ జగన్నాథ్ యూటర్న్..యువ హీరోతో నెక్ట్స్ సినిమా..?