Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Sneha Reddy | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. తాజాగా ఆయన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హా ఓ పుట్టినరోజు వేడుకలో సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారడంతో అభిమానులు వాటిపై ఆసక్తి చూపిస్తున్నారు.
Sneha Reddy | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. తాజాగా ఆయన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హా ఓ పుట్టినరోజు వేడుకలో సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారడంతో అభిమానులు వాటిపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ వేడుకలో అల్లు అర్జున్ కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, శిల్పా రవి చంద్రకిశోర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు గ్రాండ్‌గా జరగగా, స్నేహారెడ్డి తన పిల్లలు అయాన్, అర్హాతో కలిసి హాజరయ్యారు. శిల్పా రవి కుటుంబంతో స్నేహారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో ఆమె పిల్లలతో కలిసి కనిపించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అల్లు అర్జున్ అభిమానులు ఈ ఫొటోలను తెగ వైరల్ చేస్తున్నారు.ముఖ్యంగా అయాన్, అర్హా కనిపించడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడానికి మరో కారణం కూడా ఉంది. 2024 మేలో జరిగిన ఎన్నికల సమయంలో శిల్పా రవి చంద్రకిశోర్ రెడ్డికి అల్లు అర్జున్ మద్దతుగా ప్రచారం చేశారు. దీంతో వీరి కుటుంబాల మధ్య ఉన్న పరిచయాలు, స్నేహ సంబంధాలపై అప్పటి నుంచే చర్చ జరుగుతోంది. తాజాగా శిల్పా రవి పుట్టినరోజు వేడుకల్లో స్నేహారెడ్డి, పిల్లలు కనిపించగా.. అల్లు అర్జున్ మాత్రం అక్కడ కనిపించలేదు.
ప్రస్తుతం అల్లు అర్జున్ ముంబైలో ‘రాకా’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉండి ఉండవచ్చనే ప్రచారం వినిపిస్తోంది. అయితే ఆయన ఈ వేడుకకు ఎందుకు హాజరు కాలేదనే విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు స్నేహారెడ్డి, పిల్లలు కలిసి వేడుకకు హాజరైన ఫొటోలు మాత్రం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అల్లు అర్జున్ కనిపించకపోవడంతో ఆయన ఎక్కడ ఉన్నారు? షూటింగ్ కారణంగానే వేడుకకు దూరంగా ఉన్నారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

