Manu Bhaker | పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024)లో సంచలనం సృష్టించింది షూటర్ (shooter) మను బాకర్ (Manu Bhaker). పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో మను బాకర్ రెండు పతకాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రెండు సార్లూ కాంస్య పతకాన్ని ముద్దాడింది. అయితే, ఈ విశ్వ క్రీడల్లో హ్యాట్రిక్ మెడల్స్ కొట్టే అవకాశాన్ని మను చేజార్చుకుంది. ఈవెంట్లో టాప్ ఫామ్‌లో ఉన్న ఆ షూటర్.. 25మీటర్ల పిస్తోల్ ఈవెంట్లో తృటిలో కాంస్య పతకాన్ని మిస్ చేసుకుంది. దీంతో రెండు పతకాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండు పతకాలతోపాటు ఎన్నో రికార్డులను కూడా తన పేరిట లిఖించుకుని భారత్ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది.
అయితే మను నేడు స్వదేశానికి తిరిగి వచ్చింది. ఇవాళ ఉదయం కోచ్ జస్పాల్ రాణా (Jaspal Rana)తో కలిసి దేశరాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో (Delhi airport) ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా షూటర్‌కు ఘన స్వాగతం లభించింది. అయితే మను బాకర్ నేరుగా ఇంటికి వెళ్లగా.. ఆమె ఇంటికి వెళ్లి మరి మనుకి విషెస్ తెలిపాడు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. ఈ సందర్భంగా మనుతో ఫొటో దిగి ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశాడు. అయితే ఈ ఫొటోలో జాన్ అబ్రహం మను ఒలింపిక్స్ మెడల్‌ను పట్టుకుని ఫొటో దిగడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అయ్యారు. సోషల్ మీడియాలో జాన్ అబ్రహంను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
డియర్ జాన్ అబ్రహం ఆమెతో ఫొటో దిగే హక్కు మాత్రమే మీకు ఉంది కానీ మెడల్‌ను తాకే అర్హత మీకు లేదని ఒక నెటిజన్ రాసుకోచ్చాడు. మరో నెటిజన్ మీకు మెడల్ తాకే రైట్ ఎవరు ఇచ్చారంటూ రాసుకోచ్చాడు. జాన్ అబ్రహం క్షమించండి, వేరొకరు సాధించిన పతకాన్ని తాకే హక్కు మీకు లేదు అంటూ మరో యూజర్ రాసుకోచ్చాడు. ఇంకొ నెటిజన్ రాసుకోస్తూ.. ఒకరు సాధించిన మెడల్‌ను తాకడం అనేది వారి విజయాన్ని తక్కువ చేసినట్లే ఇంకోసారి ఇలాంటివి చేయకండి అంటూ రాసుకోచ్చాడు.
Also Read..
Bangladesh unrest | కోల్‌కతాపై బంగ్లాదేశ్ అశాంతి ప్రభావం.. 15 రోజులుగా వ్యాపారాలు బంద్
MLA Krishna Rao | భవిష్యత్ తరాల కోసం మొక్కలు నాటాలి : ఎమ్మెల్యే మాధవరం