బిగ్ బాస్ 5 (Bigg Boss Telugu 5) తెలుగు మొదలైనప్పుడు పూర్తిగా కొత్త కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు. ప్రేక్షకులకు అసలు వాళ్లు పరిచయం కూడా లేదు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్లు. వీళ్ల బ్యాగ్రౌండ్ ఏంటి అంటూ గూగుల్ చేశారు. అలాంటి ఒక కంటెస్టెంట్ జశ్వంత్ పడాల (Jaswanth padala) ఉరఫ్ జెస్సి. మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ఈయన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ షోకి వచ్చి ఇక్కడ కూడా ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. జెస్సి ఇప్పుడు ఉన్నట్లుండి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడని ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది.
దానికి కారణం కూడా ప్రత్యేకంగా ఏమీ లేదు. గత రెండు వారాలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు జస్వంత్. వర్టిగో (Vertigo disease) సమస్యతో ఈయన చాలా ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నవాళ్లకు కంటిచూపు మందగించడం..చెవులు సరిగ్గా వినిపించక పోవడం..అలాగే ఎక్కువ సేపు నిలబడిన కూడా శరీరం అసౌకర్యంగా ఉండటం లాంటి లక్షణాలు ఉంటాయి. గత 15 రోజులుగా ఈ సమస్యతో బాధ పడుతున్నాడు జశ్వంత్. మధ్యలో ఒకట్రెండు సార్లు బిగ్ బాస్ ఇంటికి డాక్టర్ వచ్చి అతడిని ట్రీట్ చేసి వెళ్ళాడు. అయినా కూడా జెస్సీ ఆరోగ్యం పూర్తిస్థాయిలో కుదుట పడలేదు.
మొన్న నాగార్జున (Nagarjuna) అడిగినప్పుడు కూడా ఎలాంటి బెటర్మెంట్ లేదు అని చెప్పాడు ఈయన. ఇక ఇప్పుడు వాంతులతోపాటు అనారోగ్యం తీవ్రం కావడంతో అతనిని చికిత్స కోసం బయటకు పంపించినట్లు తెలుస్తోంది. ఒకసారి బయటికి వెళ్లిన తర్వాత మళ్లీ లోపలికి వచ్చి రావడం అనేది అంత చిన్న విషయం కాదు. గత సీజన్లో గంగవ్వ, సింగర్ నోయల్ ఇద్దరూ అనారోగ్యం కారణంగా బయటకు వెళ్లారు. మళ్లీ ఇంటి లోపలికి రాలేదు. ఓ రకంగా చెప్పాలంటే ఇది అన్ అఫీషియల్ ఎలిమినేషన్ కింద లెక్క. మరి ఇప్పుడు జెస్సీ అలా బయటకి వెళ్తున్నాడా లేదంటే మళ్లీ తిరిగి ఇంట్లోకి వస్తాడా..? అనేది ఆసక్తికరంగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
Laddunda lyrical promo | దరువేస్తూ బంగార్రాజు ‘లడ్డుందా’ సాంగ్ ప్రోమో
Rana: ఒక్క పోస్ట్‌తో ముగ్గురు సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన రానా