నాని (Nani) కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా జెర్సీ (Jersey)..పలు విభాగాల్లో నేషనల్ అవార్డులు అందుకున్న చిత్రం. ఇపుడు ఇదే టైటిల్ తో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన క్రికెట్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా మేకర్స్ జెర్సీ నుంచి డిలీటెడ్ వీడియో (Jersey Deleted Scene) ఒకటి విడుదల చేశారు.
హీరోయిన్ శ్రద్దాశ్రీనాథ్ తండ్రి నాని దగ్గరకు రూ.50 వేలు పట్టుకొచ్చి..ఈ డబ్బు ఎక్కడివ్వాలో అక్కడిచ్చి అతని ప్రభుత్వ ఉద్యోగం తిరిగి తెచ్చుకోమని చెప్తాడు. నన్ను వెతుక్కుంటూ వచ్చి ఈ డబ్బులు ఇస్తున్నందుకు థ్యాంక్స్..కానీ నాకీ డబ్బులు అవసరం లేదని చెప్తున్నాడు. దానికి నానిపై కోప్పడుతూ నువ్వెన్నటికీ ఇండియా తరపున ఆడలేవు అంటాడు. సీరియస్, ఎమోషనల్‌గా సాగుతున్న ఈ సీన్లు నెటిజన్లు, మూవీ లవర్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రద్దాశ్రీనాథ్ (Shraddha Srinath), రోనిత్ కర్మ, సత్యరాజ్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందరో కంపోజ్ చేసిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.