Drishyam 3 | సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి చిత్రాల్లో టాప్‌లో ఉంటుంది దృశ్యం (Drishyam). మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రాంఛైజీగా వచ్చిందని తెలిసిందే. దృశ్యం మాలీవుడ్ వెర్షన్లో మోహన్ లాల్, మీనా నటించగా.. తెలుగు వెర్షన్లో వెంకటేశ్, మీనా, హిందీ వెర్షన్లో అజయ్ దేవ్గన్, శ్రియా శరన్ నటించారు.
విడుదలైన అన్ని భాషల్లో దృశ్యం, దృశ్యం 2 సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. అయితే ఇక దృశ్యం 3 కూడా రాబోతుందంటూ ఇప్పటికే నెట్టింట వార్తలు రౌండప్ చేస్తున్నాయి. జీతూ జోసెఫ్ టీం దృశ్యం 3 షూటింగ్‌ను మలయాళం, హిందీలో ఏకకాలంలో కొనసాగిస్తున్నట్టు ఓ గాసిప్ నెట్టింట చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కాగా డైరెక్టర్ ఇటీవలే దృశ్యం 3 (Drishyam 3) స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడని మరో వార్త తెరపైకి వచ్చింది. అంతేకాదు షూటింగ్ త్వరలోనే మొదలు కానుందని.. 2025లో దృశ్యం 3 ప్రేక్షకుల ముందుకు రాబోతుందని న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
అయితే ఈ పుకార్లలన్నింటిని కొట్టిపారేశాడు డైరెక్టర్. దృశ్యం 3 స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని.. ఇప్పట్లో ట్రాక్‌పై వచ్చే అవకాశాలు తక్కువేనన్నాడు. మోహన్ లాల్ (Mohan lal) కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ లెక్కన దృశ్యం 3 రావాలంటే అభిమానులు నిరీక్షించక తప్పదు.
Read Also :
Salaar 2 | సలార్ 2లో కాటేరమ్మ ఫైట్‌ను మించిపోయే సీక్వెన్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే..!
Akkineni Nagarjuna | రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ కామెంట్స్ : నాగార్జున