Jani Master | లైంగిక వేధింపుల కేసులో (sexual assault case) అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ (Jani Master)కు ఉప్పరపల్లి కోర్టు (Upparpally court) షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఓ డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు జానీపై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2)తోపాటు పోక్సో కేసులు నమోదు కాగా.. దీనిపై విచారణ జరిపిన ఉప్పరపల్లి కోర్టు (Upparpally court) 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అక్టోబర్ 3 వరకు రిమాండ్‌లో ఉంచాలని ఆదేశించింది. దీంతో జానీని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే తన భర్త వేధింపుల కేసుకు సంబంధించి తొలిసారి మీడియాతో మాట్లాడింది జానీ మాస్టర్ భార్య సుమలత.
ఆమె మాట్లాడుతూ.. జానీ మాస్టర్ ఎదగకూడదనే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అసలు ఆ అమ్మాయికి ట్యాలెంట్ ఉందనే ఉద్దేశ్యంతోనే జానీ ఆమెకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. స్టేజి డ్యాన్సులు చేసుకునే అమ్మాయికి అవకాశం ఇస్తే ఇప్పుడు ఆయనపైనే తప్పుడు ఆరోపణలు చేస్తుంది. 16 ఏళ్లకే అత్యాచారం జరిగింది అంటున్నారు. అందుకు సాక్ష్యం ఉందా? దానికంటే ముందు ఆమె ఎవరి దగ్గరికి వెళ్లలేదని ఆధారం ఉందా.. ఆ అమ్మాయికి చాలామంది కొరియోగ్రాఫర్స్‌తో ఎఫైర్స్ ఉన్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Also Read..