Janhvi Kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. శ్రీదేవి వారసురాలిగా సినీరంగ ప్రవేశం చేసిన జాన్వీ.. తనదైన నటనతో కొద్ది సమయంలోనే అగ్ర హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నది. తెలుగులో దేవర మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ సరసన నటిస్తున్నది. తాజా కరణ్ జోహార్ షోలో జాన్వీ కపూర్ పాల్గొన్నది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని ఉందని తన కోరికను బయటపెట్టింది.
ముగ్గురు పిల్లలను కనాలని ఉందని.. పిల్లలు, భర్తతో కలిసి తిరుమలలోనే హాయిగా గడపాలని ఉందని చెప్పింది. నిత్యం అరటి ఆకులో భోజనం చేస్తూ.. గోవిందా గోవిందా అని సర్మించుకోవాలని ఉందని తెలిపింది. మణిరత్నం సినిమాల్లోని పాటలు వింటూ కూర్చోవాలని ఉందని చెప్పుకొచ్చింది. తన భర్తను లుంగీలోనే చూడాలని ఉందని.. చూసేందుకు చాలా రొమాంటిక్‌గా ఉంటుందని జాన్వీ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. జాన్వీ కపూర్‌కు తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే ఎనలేని భక్తి. సమయం దొరికినప్పుడల్లా తిరుమలను సందర్శిస్తుంటారు. జాన్వీ కపూర్ తెలుగులో ‘దేవర-1’లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ 16 మూవీలో నటిస్తున్నది. బాలీవుడ్లో సన్నీ సంస్కారీ కి తులసీ కుమారి మూవీలో నటిస్తున్నది. ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానున్నది.
Victory Venkatesh | నేను బ్లాక్ మనీ తీసుకోను.. నాదంతా వైట్ : విక్టరీ వెంకటేష్