Sankranthiki Vasthunam | విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కథానాయకుడిగా వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా.. కేవలం 9 రోజుల్లోనే రూ.230 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో తాజాగా మూవీ టీం సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది.
ఇందులో దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు నటుడు వెంకటేశ్ పాల్గోన్నారు. అయితే గత మూడు రోజులుగా టాలీవుడ్ ప్రముఖులపై ఐటీ రైడ్లు అవుతున్న నేపథ్యంలో ఒక రిపోర్టర్ వెంకటేశ్‌ని అడుగుతూ.. హీరోలు కనుక మొత్తం వైట్ మనీ తీసుకుంటే ఏ నిర్మాతకు బ్లాక్ ఇవ్వవలసిన అవసరం లేదు. దీనిపై మీరేం అంటారు అంటూ రిపోర్టర్ వెంకీని ప్రశ్నించగా.. వెంకీ మాట్లాడుతూ.. మిగత హీరోల గురించి నాకు తెలియదు. నాదాంతా ఫుల్ వైట్. నేను తీసుకొనేదే కొంత అది కూడా వైట్‌లోనే.. అది కూడా నా చేతికి రాదు. ఆఫీస్‌కు వెళుతుంది. అందులో నుంచి కూడా నా ఖర్చుల కోసం తీసుకుంటాను అంటూ వెంకటేశ్ చెప్పుకోచ్చాడు.