Janhvi Kapoor | ఐపీఎల్ 2026 క్రేజ్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వేళ సోషల్ మీడియాలో ఒక సరదా వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కలిసి ఆడిన గల్లీ క్రికెట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను కూడా ఈ వీడియో బాగా ఆకర్షిస్తోంది. నోయిడాలోని ప్రముఖ DLF మాల్ ఆఫ్ ఇండియాలో ఇటీవల జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్‌కు ప్యాట్ కమిన్స్, జాన్వీ కపూర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ సరదాగా క్రికెట్ ఆడి అక్కడి ప్రేక్షకులను అలరించారు. జాన్వీ టీ-షర్ట్‌లో క్యాజువల్ లుక్‌లో బ్యాట్ పట్టుకుని క్రీజులోకి రాగా, కమిన్స్ బౌలింగ్ చేయడం ఆసక్తికరంగా మారింది.
ప్రపంచ స్థాయి పేసర్ అయిన కమిన్స్ వేసిన తొలి మూడు బంతులను జాన్వీ కపూర్ జాగ్రత్తగా ఆడింది. అయితే నాలుగో బంతిని బలంగా కొట్టే ప్రయత్నంలో ఆమె షాట్ అక్కడున్న ఒకరి కంటికి తగిలినట్లు సమాచారం. దీంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు వెల్లువెత్తాయి. ఈ సరదా సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “నా బ్యాటింగ్ వల్ల బంతి ఎవరికైతే తగిలిందో వారికి క్షమాపణలు. ఇంకా నా బ్యాలెన్స్ కోసం వెతుకుతున్నాను” అంటూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇక మరోవైపు, ప్రమోషన్స్ కోసం ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్‌తో ఇలా సరదా ఈవెంట్ చేయడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మైదానంలో ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే ప్యాట్ కమిన్స్ ఇలా ఫన్ మోడ్‌లో కనిపించడం కూడా అభిమానులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ప్రస్తుతం ఈ క్రేజీ కాంబినేషన్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.