 
                                                            Janhvi Kapoor | హిందీ,తెలుగుతోపాటు ఇండియావైడ్‌గా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న భామల్లో టాప్‌లో ఉంటుంది
బాలీవుడ్ భామ జాన్వీకపూర్. దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చిన ఈ భామ ఇటీవలే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. జాన్వీకపూర్ నటించిన తాజా చిత్రం Sunny Sanskari Ki Tulsi Kumari. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్‌తో మొదలై.. నెగెటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.
అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇప్పటివరకు కేవలం రూ.30 కోట్లు మాత్రమే రాబట్టింది. శషాంక్ ఖైతాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించింది. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ ధవన్ హీరోగా నటించాడు. హిందీలో చాలా కాలంగా మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న జాన్వీకపూర్‌కు ఈ సినిమా తీవ్ర నిరాశనే మిగిల్చిందని తాజా ఫిగర్స్ చెబుతున్నాయి.
ఇక జాన్వీకపూర్ తెలుగులో నటిస్తోన్న రెండో ప్రాజెక్ట్ పెద్దిపైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రాంచరణ్ టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
The Paradise | దసరా డైరెక్టర్‌తో ‘కిల్’ రాఘవ.. నాని ది ప్యారడైజ్‌పై సూపర్ హైప్
 
                            