కరోనా మహమ్మారి బుసలు కొడుతుంది. ఎందరో ప్రాణాలని పొట్టన పెట్టుకుంటుంది. గత ఏడాది కన్నా ఈ ఏడాది కరోనా ఉదృతి అధికంగా ఉండడంతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. కేసులు ఎక్కువగా పెరుగుతూ పోతుండడంతో ఆక్సిజన్, మందుల కొరత ఏర్పడింది. చికిత్స చేసేందుకు బెడ్స్ కూడా కరువయ్యాయి. కరోనా విలయంతో ప్రజలంతా కకావికలం అవుతుండగా, తాజాగా విలక్షణ నటుడు జగపతి బాబు అభిమాని, గుంటూరు అభిమాన సంఘం ప్రెసిడెంట్ శ్రీను కరోనాతో కన్నుమూశారు.
శ్రీను మృతితో షాక్కు గురైన జగపతి బాబు అతనికి సంతాపం తెలియజేశారు. శ్రీను కుటుంబానికి తాను ఎల్లప్పుడు అండగా ఉంటానన్నారు. శ్రీను, అతడి భార్య కోటీశ్వరిగారు వారి సంతానంలో ఒకరికి జగపతి అని తన పేరే పెట్టారని ఉద్వేగానికి లోనయ్యాడు. కరోనా వలన చాలా మంది చనిపోతున్నారు. ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతున్నారో తెలియని దుస్థితిలో ఉన్నాం. ఇప్పటికైన మాస్క్లు పెట్టుకొని, తరచు శానిటైజ్ చేసుకోవాలంటూ జగపతిబాబు హితవు పలికారు.
At least now, please wear the mask and keep social distancing, and always sanitize your hands. #StayHomeStaySafe pic.twitter.com/Tat7yEu5XU
— Jaggu Bhai (@IamJagguBhai) May 4, 2021