Simbaa Movie Review | ఓ వైపు దర్శకునిగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు కథా రచయితగా వినూత్నమైన కాన్సెప్ట్స్ తో పలు సినిమాలకు షోరన్నర్ గా వుంటున్నారు దర్శకుడు సంపత్ నంది. గాలిపటం, పేపర్ బాయ్, ఓదెల రైల్వేస్టేషన్ ఆయన కథలతో వచ్చిన సినిమాలే. ఇప్పుడు ఆయన కథతో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ‘సింబా’. రంగస్థలంలో పవర్ ఫుల్ రోల్స్ లో ఆదరగొట్టిన జగపతి బాబు (Jagapathi Babu)., అనసూయ లాంటి స్టార్స్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించడంతో సినిమా అందరి ద్రుష్టిని ఆకర్షించింది. ప్రకృతి నేపధ్యంలో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, సైంటిఫిక్ ఎలిమెంట్స్ జోడించి మురళీ మనోహర్ రెడ్డి (Murali Manohar Reddy) తీసిన ‘సింబా’ ప్రేక్షకులు ఎలాంటి అనుభూతిని పంచిందో రివ్యూలో చూద్దాం.
కథ గురించి:
హైదరాబాద్ లో ఓ దారణ హత్య జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి పార్థ(కబీర్ సింగ్) గ్రూపుకి సంబధించిన కీలక వ్యక్తి. దీంతో ఈ కేసును సీరియస్ గా తీసుకుంటారు పోలీసులు. విచారణ జరుగుతుండగానే మరో హత్య జరుగుతుంది. ఈ రెండు హత్యల వెనుక స్కూల్ టీచర్ అక్షిక(అనసూయ), ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఫాజిల్(శీనాథ్ మాగంటి) ఉన్నారని నిర్ధారించిన పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేస్తారు. ఇంతలో వీరిద్దరిని చంపాలని చూసి వ్యక్తి పోలీసుల సమక్షంలోనే హత్యకు గురౌతాడు. తర్వాత ఏం జరిగింది ? అసలు ఈ వరుస హత్యలకు కారణం ఏమిటి ? ఎవరు చంపుతున్నారు ? పార్థకి, హత్యలు చేస్తున్న వ్యక్తికి లింక్ ఏమిటి ? ఇందులో పురుషోత్తమ్ రెడ్డి(జగపతిబాబు) పాత్ర ఏమిటి ? ఇదంతా మిగతా కథ.
కథా విశ్లేషణ :
కాన్సెప్ట్ బేస్డ్ కథలపై ద్రుష్టి పెట్టారు సంపత్ నంది. గతంలో ఆయన అందించిన కథ ఓదెల రైల్వేస్టేషన్ లో కూడా ఒక క్రైమ్ కాన్సెప్ట్ వుంది. ‘సింబా’లో బయోలాజికల్ మెమరీ కాన్సెప్ట్ ఆధారంగా ఒక రివెంజ్ డ్రామాగా ఈ కథని తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకునేలానే వుంటుంది. ముఖ్యంగా ఒక క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో పర్యావరణం, పకృతి పరిరక్షణ గురించి చెప్పిన తీరుని అభినందనీయం. నిజానికి సమాజానికి చాలా అవసరమైన అంశం ఇది. మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తరహలో సినిమా మొదలౌతుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే వరుస హత్యలు కథపై ఆసక్తిని పెంచుతాయి.
సెకండ్ హాఫ్ లో అసలు పాయింట్ రివిల్ అవుతుంది. ఫారెస్ట్ మ్యాన్ గా జగపతి బాబు క్యారెక్టర్ చుట్టూ వున్న నేపధ్యం ఆసక్తికరంగా తీశారు. ముఖ్యంగా పకృతి పరిరక్షణ నేపధ్యంలో వచ్చే సన్నివేశాలు ఆలోచన రేకెత్తించేలా వుంటాయి. మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ దేశవ్యాప్తంగా స్ఫూర్తినిచ్చిన సంగతి తెలిసిందే. ఆయన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా కొన్ని లక్షల మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేశారు. ఇలాంటి స్పూర్తివంతమైన వ్యక్తుల అవసరం సమాజానికి ఎంతో అవసరం ఉందని జగపతి బాబు పాత్ర ద్వారా తెలియజేశారు.
సింబాలో ఆయన స్ఫూర్తిని ప్రతిబింబించేలా జగపతి బాబు పాత్ర చెప్పిన మాటలు మనసుని హత్తుకుంటాయి. అయితే బియోలాజికల్ మెమరీ కాన్సెప్ట్ ఎంగేజింగా వునప్పటికీ నేరపరిశోధనలో సాగే ప్రధమార్ధం అంత థ్రిల్లింగ్ అనిపించదు. చాలా సన్నివేశాలు ప్రేక్షకులు ఊహకు అందిపొతుంతాయి. ఫస్ట్ హాఫ్ లో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ లో వచ్చే కథనం ఆసక్తికరంగా వుంటుంది.
నటీనటులు నటన:
జగపతిబాబు తన అనుభవంతో ఈ పాత్రని చాలా యీజ్ తో చేశారు. ఆయన ఇమేజ్, ఆహార్యం పాత్రకు తగ్గట్టుగా వుంది. అనసూయ, శ్రీనాథ్ మాగంటి పెర్ఫార్మెన్స్ డీసెంట్ గా వుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా వశిష్ఠ సింహాకి మంచి మార్కులు పడతాయి. కబీర్ పాత్రని ఇంకా బలంగా తీర్చిదిద్దాల్సింది. గౌతమి, కస్తూరి స్పెషల్ రోల్స్ లో కనిపిస్తారు.
టెక్నికల్‌గా..
నిర్మాణ విలువలు బావున్నాయి. కృష్ణ సౌరభ్ నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా చేశాడు. కెమెరా వర్క్ బాగా కుదిరింది. సమాజానికి అవసరమయ్యే ఇలాంటి కంటెంట్ ని నిర్మించడంలో నిర్మాతల అభిరుచి కనిపించింది.
ఇక మురళీ మనోహర్ దర్శకుడిగా తన తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడని చెప్పాలి. కథనంలో కాస్త లోపం కనిపించినా.. తన టేకింగ్ స్కిల్స్‌తో దర్శకత్వ ప్రతిభను చాటుకున్నాడు. టెక్నికల్ టీంను సాధ్యమైనంత వరకు వినియోగించుకుని సింబాను విజయవంతంగా సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కృతం చేశాడనిపిస్తోంది.
ప్లస్ పాయింట్స్ :
కథా నేపథ్యం,
సెకండ్ హాఫ్ మంచి సందేశం
మైనస్ పాయింట్స్ :
బలహీనమైన ఇన్వెస్టిగేషన్
ఊహకు అందే ఫస్ట్ హాఫ్
రేటింగ్: 3/5
Mahesh Babu | మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్.. క్యూరియాసిటీ పెంచుతున్న కొత్త లుక్
Mangalavaaram | మరో భాషలో పాయల్ రాజ్‌పుత్ మంగళవారం.. ఏ ప్లాట్ఫాంలోనంటే!
Sai Pallavi | ఆన్ డ్యూటీ.. సాయిపల్లవి ఇప్పుడెక్కడుందో తెలుసా..?