Jagapathi Babu | టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విలన్‌గా, ఫ్యామిలీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన యాక్టింగ్‌తో కోట్లాదిమంది అభిమానులను ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. అయితే ఈ టాలెంటెడ్ యాక్టర్‌ను చాలా మంది జగ్గూభాయ్ (Jaggu Bhai) అని పిలుస్తుంటారని తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక పోస్ట్‌తో అందరినీ పలుకరిస్తుంటాడు జగ్గూభాయ్. ఇప్పుడు తాజాగా ఓ పోస్టు పెట్టి వార్తల్లో నిలిచాడు.
తాజాగా ఓ క్యాసినోకి వెళ్లిన జగపతిబాబు అక్కడ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ పోస్ట్‌కు.. నాకు సిగ్గు శరం లేదని దిగులు పడను.. కానీ మీరు చెబితే పడతాను అంటూ ఈ పోస్ట్ కింద రాసుకోచ్చాడు. ఈ ఫొటో చూస్తుంటే జగ్గూభాయ్ క్యాసినోలో పోకర్ గేమ్ ఆడినట్లు తెలుస్తుంది. గతేడాది సలార్‌తో పాటు ‘రుద్రంగి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జగపతిబాబు ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం జగ్గూభాయ్ సలార్ 2 చిత్రంలో నటిస్తున్నాడు.
Siggu saram Leni Vadinnani diggulu paddanu. Meeru cheppitthey padathaanu. pic.twitter.com/ObmV2ACHq5
— Jaggu Bhai (@IamJagguBhai) July 18, 2024
Also Read..