Khammam | ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వాన.. భద్రాచలంలో నిలిచిన రాకపోకలు
ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో వర్షం దంచికొడుతున్నది. గురువారం తెల్లవారుజాము నుంచి భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఎడతెరపిలేకుండా వానకురుస్తున్నది. దీంతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం 21 అడుగులకు చేరింది.
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో వర్షం దంచికొడుతున్నది. గురువారం తెల్లవారుజాము నుంచి భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఎడతెరపిలేకుండా వానకురుస్తున్నది. దీంతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం 21 అడుగులకు చేరింది. చర్ల వద్ద రహదారిపైనుంచి మూడడుగుల మేరు నీళ్లు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేకపోవడంతో భద్రాచలంలో రోడ్లపై ముగునీరు ప్రవహిస్తున్నది.
ఉదయం నుంచి భారీగా వర్షం కురుస్తుండటంతో సత్తుపల్లిలోని జేవీఆర్, కిష్టారం గనుల్లో 15 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సింగరేణి జీకేలో 5 ఓపెన్‌కాస్ట్ గనుల్లో వెయ్యి టన్నులు, ఇల్లందు, కోయగూడెం ఓపెన్‌కాస్టుల్లో 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సంక్రాంతికి ముస్తాబు
నేడు వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

