DSC Exam| ప్రారంభమైన డీఎస్సీ.. రెండు సెషన్లలో పరీక్షలు
రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు (DSC Exam) ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు మొదటి షెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకూ రెండో సెషన్ జరగనుంది. ఒక్కో సెషన్లో 13 వెల మంది చొప్పున రెండు సెషన్లకు కలిపి రోజుకు 26 వేల మంది డీఎస్సీ అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు (DSC Exam) ప్రారంభమయ్యాయి. నేటి నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు మొదటి షెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకూ రెండో సెషన్ జరగనుంది. ఒక్కో సెషన్లో 13 వెల మంది చొప్పున రెండు సెషన్లకు కలిపి రోజుకు 26 వేల మంది డీఎస్సీ అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం 2 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం 14 జిల్లాలో 54 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పరీక్ష సమయానికి 10 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లను అధికారులు మూసివేశారు. ప్రతిఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి అనుమతించారు. ఉదయం ఏడున్నర నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాలలోని అనుమతించారు. డీఎస్సీ పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరగడం ఇదే మొదటిసారికావడం విశేషం. రాష్ట్రప్రభుత్వం 11,056 పోస్టులతో ఫిబ్రవరి 29న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 2,629 స్కూల్ అసిస్టెంట్, 727 భాషా పండితులు, 182 పీఈటీ, 6,508 ఎస్జీటీ, ప్రత్యేక కేటరిగిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి.
కాగా, డీఎస్సీ వాయిదా వేయాలని, పోస్టుల సంఖ్యను పెంచాలని అభ్యర్థులు పోరుబాటపట్టారు. ఉద్యోగార్థులు ఉధృతంగా ఉద్యమం చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా పరీక్షలు నిర్వహిస్తున్నది. దీంతో 2,79,956 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, బుధవారం నాటికి 2,48,851 మంది మాత్రమే హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. మరో 31,105 మంది డౌన్లోడ్ చేసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, దమనకాండకు నిరసనగా వీరంతా పరీక్షలు రాయకుండా తమ నిరసనను వ్యక్తంచేస్తున్నారు. వందలాదిమంది డౌన్లోడ్ చేసుకున్న తమ హాల్టికెట్లను కాల్చివేసి నిరసన తెలిపారు. తమకు ప్రిపేరేషన్కు తగిన సమయం ఇవ్వలేదని, తాము పరీక్ష రాయబోమంటూ.. సర్కారుపై మండిపడుతున్నారు.
ఒక్కో ప్రశ్నకు అర మార్కు
డీఎస్సీ పరీక్షలో 160 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు పరీక్ష జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ ఆఫైర్స్ నుంచి 20 మార్కులు, విద్యా దృక్పథాల నుంచి 20, కంటెంట్ (నాన్ లాంగ్వేజస్ అండ్ లాంగ్వేజస్) నుంచి 88, బోధనా పద్ధతుల నుంచి 32 కలిపి మొత్తం 160 ప్రశ్నలకు డీఎస్సీ పరీక్షలను నిర్వహించనున్నారు. టెట్ పరీక్షకు 20 మార్కుల వెయిటేజీ ఉండగా, అభ్యర్థులు సాధించిన మార్కుల ప్రకారం వెయిటేజీని అమలుచేసి మొత్తం 100 మార్కులుగా లెక్కలోకి తీసుకుంటారు. స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్), పీఈటీ పోస్టులకు టెట్ లేకపోవడంతో వీరికి మాత్రం 200 ప్రశ్నలతో 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

