Jurala | జూరాలకు పెరుగుతున్న వరద ప్రవాహం
ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లా లోని జూరాల (Jurala) ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 1500 క్యూసెక్కుల వరద వస్తుండగా, 1800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
గద్వాల: ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లా లోని జూరాల (Jurala) ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 1500 క్యూసెక్కుల వరద వస్తుండగా, 1800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.14 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.987 టీఎంసీలుగా ఉంది. జూరాల జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో జూరాల అధికారులు జల విద్యుత్ ద్వారా ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్ట్ కుడి, ఎడమల కాలువలతో పాటు నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకానికి సాగు నీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు.
కాగా, ఎగువన ఉన్న ఆల్మట్టి నారాయణపూర్ జలాశయంలోకి 70వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకున్నది. దీంతో అధికారు 68,920 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 492.25 మీటర్లు కాగా ప్రస్తుతం 491.27 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ 33. 31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 31.09 టీఎంసీలుగా ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

