విలన్‌గా, ఫ్యామిలీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన యాక్టింగ్‌తో కోట్లాదిమంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకున్నాడు సీనియర్ నటుడు జగపతిబాబు. ఈ టాలెంటెడ్ యాక్టర్‌ను చాలా మంది జగ్గూభాయ్ అని పిలుస్తుంటారని తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక పోస్ట్‌తో అందరినీ పలుకరిస్తుంటాడు జగ్గూభాయ్. ఈ సారి దేవుడికి పూజ చేస్తున్న వీడియోను ట్యాగ్ చేస్తూ.. ఫన్నీ కామెంట్స్ పెట్టి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు.
సాయిబాబా (saibaba)కు పూజ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. దేవుడా.. అందరూ నా దగ్గర ఉందనుకుంటున్న డబ్బు నాకు ఇచ్చేయ్.. చెప్పలేక చస్తున్నా.. అంటూ ట్వీట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మీ కోరిక త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నా.. అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. హహహ ఏం టైమింగ్ సార్ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
ఈ ఏడాది రాధేశ్యామ్, గని, పరంపర సీజన్ 2 లో మెరిశాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు జగపతిబాబు. ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ సలార్‌లో కీ రోల్ చేస్తున్నాడు. దీంతోపాటు కన్నడలో కబ్జా, మలయాళంలో వాయిస్ ఆప్ సత్యానందన్లో నటిస్తున్నాడు. హిందీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
జగపతిబాబు పూజ వీడియో..
Devuddaa…Andharu naa daggara undhanukuntuna dabbu naaku iccheyi…cheppaleka Chastuna. pic.twitter.com/mGpe9D4Ty5
— Jaggu Bhai (@IamJagguBhai) November 13, 2022
Read Also : Anusha Shetty | నాగశౌర్య ఫియాన్సీ అనూషశెట్టి బ్యాక్‌గ్రౌండ్ వివరాలివే..!
Read Also : Sid Sriram | హిట్ 2లో సిద్ శ్రీరామ్ ఉరికెఉరికె పాట షురూ అయిందిలా.. వీడియో వైరల్
Read Also : Telugu Film Producers Council | సంక్రాంతి సినిమాల రిలీజ్‌పై టీఎఫ్‌పీసీ ప్రెస్ నోట్.. వివరాలివే