Jacqueline Fernandez | గ్లామరస్ రోల్స్‌తోపాటు నటనకు ఆస్కారమున్న పాత్రలు చేస్తూ ఇండియావైడ్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న భామల్లో ఒకరు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez). ఎప్పటికప్పుడు కొత్త కొత్త లుక్స్‌లో కనిపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది.
లండన్ ఫ్యాషన్ వీక్ అనామిక ఖన్నా AK|OK runway షోలో హొయలు పోతూ కెమెరాకు ఫోజులిచ్చిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తాజాగా మరో ఈవెంట్లో తళుక్కున మెరిసింది. ఈసారి పారిస్ ప్యాషన్ వీక్ 2025లో బ్లాక్ కాస్ట్యూమ్స్‌లో సందడి చేసింది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వేలాడుతున్న హియర్ రింగ్స్‌తో చేతిలో హ్యాండ్ పర్స్ పట్టుకొని లైటింగ్స్ మధ్య హొయలు పోతూ కెమెరాలకు ఫోజులిచ్చింది. బ్లాక్ డ్రెస్‌లో నక్షత్రంలా మెరిసిపోతూ కుర్రకారు మతులు పోగొడుతోంది.
కిక్, రేస్, రైడ్, వెల్కమ్, హౌస్‌ఫుల్ సినిమాలతో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జాక్వెలిన్ త్వరలో తెలుగులో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతుందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భామ టాలీవుడ్ డైరెక్టర్‌తో ఫీ మేల్ సెంట్రిక్ సబ్జెక్టుతో ఓ సినిమా చేసేందుకు రెడీ అయిందని తెలుస్తుండగా.. దీనిపై రానున్న రోజుల్లో ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
#JacquelineFernandez Stuns At #ParisFashionWeek 2025, Cements Global Style Icon Status pic.twitter.com/37gdkVoLHa
— Bollywood Buzz (@BollyTellyBuzz) October 4, 2025
Jacqueline Fernandez 🖤#Jacqueline #JacquelineFernandez pic.twitter.com/CiNQsjhsh0
— WV (@Weekendvibes_) October 4, 2025
Kalki 2 | సాయిపల్లవితో నాగ్ అశ్విన్ చర్చలు.. ఇంతకీ ప్రభాస్ కల్కి 2 కోసమేనా..?
Aaryan Movie | నితిన్ చేతికి విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సినిమా రైట్స్
The Raaja Saab | ప్రభాస్ ‘ది రాజాసాబ్’ డబ్బింగ్ షురూ.!