Jacqueline Fernandez | ఓ వైపు అందాలను ఆరబోస్తూనే.. మరోవైపు నటనకు ఆస్కారమున్న పాత్రలను చేస్తూ సిల్వర్ స్క్రీన్‌పై తనదైన ముద్ర వేసుకున్న బాలీవుడ్ భామల్లో ఒకరు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez). ఈ శ్రీలంకన్ బ్యూటీ కిక్, రేస్, రైడ్, వెల్కమ్, హౌస్‌ఫుల్, ఫతేహ్ సినిమాలతోపాటు చాలా ప్రాజెక్టుల్లో మెరిసింది. ఈ భామ ఫీ మేల్ సెంట్రిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ టాలీవుడ్ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు రెడీ అయిందన్న వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
పేపర్ బాయ్, అరి సినిమాలతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వీ జయ శంకర్. ఈ డైరెక్టర్ ఓ స్క్రిప్ట్‌ను జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు వివరించగా.. కథనం, తన పాత్ర నచ్చడంతో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వెంటనే సినిమాకు ఓకే చెప్పిందని ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ వీఎఫ్ఎక్స్ ఎలిమెంట్స్‌తో డిజైన్ చేసిన స్క్రిప్ట్ ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని అందించడం పక్కానట. అంతేకాదు మేకర్స్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
తాజా టాక్ ప్రకారం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రాబోతున్నట్టు సమాచారం. డైరెక్టర్ జయశంకర్ స్క్రిప్ట్‌కు ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నాడని.. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లడం ఖాయమని ఇన్సైడ్ టాక్. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇదివరకెన్నడూ చూడని నయా అవతార్‌లో కనిపించబోతుందట.
Film Chamber | సాప్ట్వేర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు.. సినీ కార్మికుల నిరసనపై ప్రసన్న కుమార్
JSK | అనుపమ పరమేశ్వరన్ జేఎస్కే మూవీ పాన్ ఇండియా ఓటీటీ డెబ్యూ.. ఏ ప్లాట్ఫాంలోనో తెలుసా..?
Kingdom Banner | విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ బ్యానర్లు చించేసిన తమిళ ప్రజలు.. ఎందుకంటే ?