Film Chamber | తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్కర్స్ ఫెడరేషన్‌కు చెందిన 24 కార్మిక సంఘాలు వేతనాల పెంపు కోసం సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలంటూ బంద్‌కు పిలుపునిచ్చి.. నిరసన బాట పట్టాయని తెలిసిందే. ఈ మేరకు కార్మికులు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో కమిషనర్ ఆఫీసుకు వెళ్లారు.
కాగా సినీ కార్మికుల నిరసనపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సినీ కార్మికులు 30 శాతం వేతనాలు పెంచాలని చెబుతున్నారు. కారు డ్రైవర్లకే నెలకు రూ.లక్షా 50 వేలు ఇస్తున్నాం. సాప్ట్వేర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తున్నాం. పేద సినీ కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటాం. చిన్న నిర్మాతలు నలిగిపోతున్నారు. హీరోను చూసే ప్రేక్షకుడు సినిమాకు వస్తారని అన్నారు.
ఫిల్మ్ చాంబర్తోనే మా అసోసియేషన్ ఉంటుంది. ఛాంబర్ ప్రతినిధులతో మంచు విష్ణు చర్చలు జరిపారు. ఐటీ ఉద్యోగుల కంటే ఎక్కువగా కార్మికుల జీతాలున్నాయి. ఫెడరేషన్వి ఏకపక్ష నిర్ణయాలని. కార్మికులు మాతో కలిసివస్తారని ఆశిస్తున్నామని ప్రసన్న కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
లేబర్ కమిషనర్ కిందకి వచ్చే 13 క్రాఫ్ట్స్‌లోనూ 30 శాతం వేతనాల పెంపు చేయాలని ఫెడరేషన్ కోరుతోంది. ఈ నేపథ్యంలో అదనపు కమిషనర్ గంగాధర్ ఇప్పటికే నిర్మాతలతో ఒకసారి మాట్లాడారు. ఎంత మేరకు పెంచుతారనే దానిపై స్పష్టత రాలేదు. లేబర్ కమిషనర్ మరోసారి నిర్మాతలతో చర్చలు జరిపే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.