Vijay Devarakonda | అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. స్పై యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండకి మంచి హిట్‌ని అందించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం శ్రీలంకలో షూటింగ్ చేసుకుంది.
అయితే ఈ సినిమాపై తమిళంలో నెగిటివ్ టాక్ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఈలం (శ్రీలంక)లోని తమిళ ప్రజలను విలన్లుగా చిత్రీకరించారని పలువురు కామెంట్లు పెడుతున్నారు. తాజాగా ఇదే వివాదం ఇప్పుడు మరింత ముదిరి.. తమిళనాడులోని ఒక థియేటర్లో ఈ సినిమా నడుస్తుండగా.. థియేటర్‌పై ఉన్న కింగ్డమ్ బ్యానర్‌ను చించేశారు అక్కడి ప్రజలు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
#Kingdom – banners torn by the members of Naam Tamizhar Katchi to protest bad portrayal of Eelam tamils in the movie ! pic.twitter.com/BYieY0Iszy
— Prashanth Rangaswamy (@itisprashanth) August 5, 2025