JSK | అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటించిన చిత్రం జేఎస్కే (JSK: Janaki V v/s State of Kerala). కోర్టు రూం డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మలయాళం సినిమాలో సురేశ్ గోపీ కీలక పాత్రలో నటించాడు. సీబీఎఫ్సీ నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమవడంతో పలు వాయిదాల అనంతరం జులై 17న థియేటర్లలో విడుదలైంది. ఈ వివాదాస్పద చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రం ఇక ఓటీటీలో పాన్ ఇండియా స్థాయిలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది.
జేఎస్కే ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో పలు ప్రధాన భాషల్లో విడుదల కానుంది. మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ప్రీమియర్ కానున్న జేఎస్కే మరి పాన్ ఇండియా ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఓటీటీలు వినోద రంగంలోకి వచ్చిన తర్వాత మలయాళ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే చాలా మలయాళ సినిమాలు ఓటీటీలో విడుదలై తెలుగు ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. మరి కోర్టు రూం డ్రామా నేపథ్యంలో సాగే జేఎస్కే చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Dhanush – Mrunal | ధనుష్‌తో మృణాల్ ప్రేమాయణం.. వీడియో తర్వాత ఊపందుకున్న పుకార్లు
NTR – Esquire India | ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ కవర్‌పై మెరిసిన ఎన్టీఆర్