Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం కూలీ. అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, ఆమిర్ ఖాన్, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ చేస్తున్నాడు లోకేష్. అయితే ఈ ప్రమోషన్స్‌లో భాగంగా లోకేష్ మాట్లాడుతూ.. తనకు శివకార్తికేయన్ సినిమాలో విలన్‌గా చేయమని ఆఫర్ వచ్చిందని కానీ తాను రిజెక్ట్ చేసినట్లు లోకేష్ తెలిపాడు.
సుధా కొంగర దర్శకత్వంలో రాబోతున్న ‘పరాశక్తి’ అనే చిత్రంలో తనని విలన్‌గా చేయమని శివకార్తికేయన్ అడిగాడు. కథ కూడా తనకు బాగా నచ్చింది. అయితే తాను అప్పుడు రజనీకాంత్‌తో కూలీ చేస్తుండటంతో ఆ సినిమా ఎఫెక్ట్ పడోద్దని రిజెక్ట్ చేసినట్లు తెలిపాడు.
“I was the one who supposed to do Antagonist character in #Parasakthi🤜🤛. I liked the story very much👌. #Sivakarthikeyan brother also advised to act in it♥️. But i don’t want to take risk in the timeline as it will affect #Coolie🤞”
– #LokeshKanagarajpic.twitter.com/AtgcvduEs3— AmuthaBharathi (@CinemaWithAB) August 5, 2025