NTR – Esquire India | తన నటనతో స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇండియాకు చెందిన ఎస్క్వైర్ (Esquire) మ్యాగజైన్ కవర్‌పై ఎన్టీఆర్‌ను ప్రచూరించారు నిర్వహాకులు. ‘ఫ్రమ్ టీన్ ప్రాడిజీ టు పాన్-ఇండియా పవర్‌హౌస్’ (టీనేజ్ సంచలనం నుంచి పాన్-ఇండియా శక్తిగా) మారిన స్టార్ నటుడంటూ రాసుకోచ్చింది. మెరున్ కలర్ షేర్వానీ ధరించిన ఎన్టీఆర్ కూర్చీలో కుర్చుని స్టైలీష్‌గా కనిపిస్తున్నాడు. ఇక ఈ ఫొటో షూట్ దుబాయ్‌లో జరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.
అతడిలో చరిష్మా ఉంది. చాలా చురుకైన వ్యక్తి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నటులలో అతడు కూడా ఒకరు. గొప్ప కుటుంబంలో పుట్టినప్పటికీ.. ఆ వారసత్వానికి కట్టుబడి ఉండాలని ఆయన ఎప్పుడూ కోరుకోలేదు. అతడే ఎన్టీఆర్. అతడి సినీ ప్రయాణాన్ని మా ఆగష్టు సంచికలో మేము సెలబ్రేట్ చేయబోతున్నాం. ఇది అతడి తొలి మ్యాగజైన్ కవర్ కూడా అంటూ ఎస్క్వైర్ రాసుకోచ్చింది.
సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
He’s charismatic. He’s sharp. He’s one of the biggest names in Indian cinema. For a man born into a powerful legacy, NTR (@tarak9999) is uninterested in being defined by it. We celebrate his journey with our August issue, which happens to be his first-ever magazine cover. pic.twitter.com/XzNFoq2g32
— Esquire India (@esquire_india) August 5, 2025