Dhanush – Mrunal | కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రస్తుతం సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇటీవలే ఆయన ‘కుబేర’ మూవీతో విజయం అందుకున్నాడు. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఇడ్లీ కడై మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. హీరోగా మాత్రమే కాకుండా, దర్శకుడు, నిర్మాత, సింగర్‌గాను పేరు తెచ్చుకున్న ధనుష్ గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంటుంది. కొద్ది రోజుల క్రితం ధనుష్ సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో 18 ఏళ్ల పెళ్లి జీవితానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ధనుష్ పేరుతో పలు కథనాలు వెలువడుతున్నాయి.
ఒకప్పుడు మీనాతో పెళ్లి వార్తలూ అని చక్కర్లు కొట్టాయి. అయితే మీనా వాటిని ఖండిస్తూ, “అలాంటి సంబంధమే లేదు, మా పాపను బాధించకండి” అంటూ స్పందించారు. ఇప్పుడు బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్‌తో ధనుష్ ప్రేమలో ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. మృణాల్ పుట్టినరోజు వేడుకలో ధనుష్ ఆమెతో సన్నిహితంగా కనిపించడంపై, వీరిద్దరి మధ్య స్పెషల్ బాండ్ ఉందని టాక్ స్పీడ్‌గా స్ప్రెడ్ అయింది. చేతులు పట్టుకుని మాట్లాడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో లవ్ గాసిప్‌కు బలం చేకూరినట్టైంది. ఇక మృణాల్ బర్త్ డే రోజే ధనుష్ ముంబైకి ప్రత్యేకంగా విమానంలో వెళ్లడం, మృణాల్, అజయ్ దేవగన్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరవ్వడం ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది.
ధనుష్, మృణాల్ గతంలోను జంటగా కనిపించారు. జూలై 3న, రచయిత్రి-నిర్మాత కనికా ధిల్లన్ ధనుష్ తదుపరి చిత్రం ‘తేరే ఇష్క్ మే’ కోసం ఏర్పాటు చేసిన పార్టీలో మృణాల్ సందడి చేసింది. కనికా షేర్ చేసిన ఫొటోల్లో మృణాల్, ధనుష్ సినిమా యూనిట్ తో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులివ్వడంతో అప్పటి నుండే వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారన్న రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ధనుష్ కానీ, మృణాల్ కానీ ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరిపై రకరకాల కామెంట్లు కొనసాగుతున్నాయి.
Dhanush and Mrunal Thakur are dating? pic.twitter.com/ItWYJdsm8a
— Aryan (@Pokeamole_) August 3, 2025