శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 19:31:30

‘కార్పొరేటర్’ గా జబర్దస్త్ కమెడియన్

‘కార్పొరేటర్’ గా జబర్దస్త్ కమెడియన్

జబర్దస్త్ నుంచి ఇప్పటికే చాలా మంది కమెడియన్లు హీరోలయ్యారు. కానీ ఒకట్రెండు ఫ్లాపుల తర్వాత ఆపేసారు. అయితే షకలక శంకర్ మాత్రం వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈయన హీరోగా ఇప్పుడు మరో సినిమా కూడా వస్తుంది. అదే కార్పొరేటర్.. గ్రేటర్ ఎన్నికల వేళ ఈయన సినిమా అనౌన్స్ చేసాడు. సంజయ్ పూనూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సమీప మూవీస్-ఎయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎ.పద్మనాభరెడ్డి నిర్మాత. ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. అందులో కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు శంకర్. సినిమా అంతా విజయవాడ నేపథ్యంలోనే జరుగుతుంది. 


కార్పొరేషన్ ఎలక్షన్స్ బ్యాక్ డ్రాప్‌లో 5 పాటలు, 4 ఫైట్స్ కలిగిన రెగ్యులర్ ఫార్మాట్ లోనే వినోదానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంతర్లీనంగా ఒక మంచి సందేశం ఉంటుందని తెలిపాడు దర్శకుడు సంజయ్. షకలక శంకర్ ఫెర్ఫార్మెన్స్ 'కార్పొరేటర్' చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఆయన చెప్తున్నాడు. ఈ సినిమాలో సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే నా పాలిటిక్స్ లో నో రూల్స్ అంటూ పోస్టర్ విడుదల చేసారు. ఇప్పటి వరకు శంకర్ నటించిన సినిమాలు ఒక్కటి కూడా విజయం సాధించలేదు. మరి ఈ రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాతో ఏం చేస్తాడో చూడాలిక.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.