jabardasth comedian hyper aadi | జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన కామెడీ చేసే విధానం కూడా మిగిలిన వారితో పోలిస్తే కాస్త విభిన్నంగా ఉంటుంది. కాంట్రవర్సీ వైపు ఎక్కువగా వెళ్లి కామెడీ సృష్టించడానికి ప్రయత్నిస్తుంటాడు హైపర్ ఆది. నవ్వించడానికి ఏదైనా చేస్తాను అంటూ ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు. బయట జరిగే కాంటెంపరరీ ఇష్యూ తీసుకొని దానికి తనదైన స్టైల్ సెటైర్లు జోడించి నవ్విస్తూ ఉంటాడు హైపర్ ఆది. అయితే కొన్నిసార్లు ఈ కామెడీ మిస్‌ఫైర్ కూడా అవుతుంది. కొంతమంది హీరోల అభిమానుల నుంచి ఆదికి బెదిరింపులు కూడా వచ్చాయి. నీ కామెడీ కోసం మా హీరోలను తక్కువ చేసి చూపిస్తావా అంటూ ఆయనపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ వీటిని పెద్దగా పట్టించుకోడు ఆది. ఇప్పుడు మరోసారి ఇదే చేశాడు. తాజాగా దీపావళి ఈవెంట్ ప్రోమోలో ఏకంగా మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణును టార్గెట్ చేశాడు.
ఈటీవీలో తగ్గేదే లే అంటూ ఒక స్పెషల్ ఈవెంట్ చేస్తున్నారు. అందులో ఎప్పట్లాగే జబర్దస్త్ కమెడియన్స్ అందరూ పాల్గొన్నారు. ఇక హైపర్ ఆది తనదైన పంచులతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే మంచు విష్ణును టార్గెట్ చేస్తూ ఆయన కొన్ని సెటైర్లు వేశాడు. మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో ప్రకాశ్ రాజ్ గురించి మాట్లాడుతున్న సమయంలో.. నరేశ్ అడ్డుకోబోతే మీరు నన్ను ఆపకండి అంకుల్.. లెట్ దేమ్ నో.. ఈ రోజు శ్రీహరి అంకుల్ గారు బతికి ఉంటే ఆయన బండారం మొత్తం బయట పడేది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దానితో పాటు ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ప్రకాశ్‌రాజ్‌కు తెలుగు భాషపై పట్టు శూన్యం అని.. కావాలంటే ఆయనను టంగుటూరి…. గురించి మాట్లాడమనండి చూద్దాం అంటూ నోరు జారాడు. దీన్ని ఇపుడు తమ స్కిట్ కోసం వాడుకున్నాడు హైపర్ ఆది. రోజా, ఇంద్రజ, ప్రియమణి లాంటి వాళ్లను టార్గెట్ చేస్తూ.. మీకు స్క్రిప్ట్ మీద పట్టు శూన్యం.. ఏది గురజాడ గురించి మాట్లాడండి చూద్దాం అంటూ సెటైర్ వేశాడు. ఏకంగా మా అధ్యక్షుడిని తన మాటలతో ట్రోల్ చేశాడు హైపర్ ఆది. ఇది కామెడీ వరకు అయితే బాగానే ఉంటుంది కానీ సీరియస్ అయింది అంటే మాత్రం వివాదం మరో స్థాయిలో ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
నా తప్పు ఉంటే కచ్చితంగా సారీ చెబుతా: హైపర్ ఆది
Hyper Aadi : 25 నిమిషాల కోసం ఆదికి 2.5 లక్షల రూపాయల పారితోషికమా?
Bala Krishna : జబర్దస్త్ షోకి జడ్జిగా బాలకృష్ణ.. రోజా అడగడంతో నో అంటాడా మరి..!
Sudheer: ఒకప్పుడు తినడానికి తిండి ఉండేది కాదు, ఇప్పుడు కోటీశ్వరుడు..!
Jabardasth Anasuya | మెగా హీరోలకు సెంటిమెంట్‌గా అనసూయ..
గుర్తు పట్టకుండా మారిపోయిన జబర్ధస్త్ కమెడీయన్
రొమాంటిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఓకే.. రెండో రోజు పరిస్థితి ఏంటి..?