Jabardasth Ramprasad | జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ తుక్కుగూడ ఔటర్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. షూటింగ్‌కు వెళ్తున్న సమయంలో తుక్కుగూడకు దగ్గరలో ప్రమాదం చోటు చేసుకున్నది. రాంప్రసాద్ ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో ఈ ఘటన చోటు చేసుకున్నది. వెనుక నుంచి వచ్చిన ఆటో కమెడియన్ కారును ఢీకొట్టింది. దాంతో నటుడికి స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.