కోలీవుడ్ హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi) చెల్లెలు పూజా కన్నన్ (Pooja Kannan) సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ స్టంట్ కొరియోగ్రాఫర్ ‘స్టంట్ సిల్వ’ డైరెక్షన్ లో పూజాకన్నన్ చేస్తున్న తొలి సినిమా (Chithirai Sevvaanam) ఇవాళ జీ5లో విడుదలైంది. తన సోదరి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం పట్ల హ్యాపీగా ఫీలవుతుంది సాయిపల్లవి. తన సంతోషాన్ని అందరితో పంచుకుంది.
ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు..ఎందుకంటే నాకు మాత్రమే తెలిసిన దాన్ని (పూజాకన్నన్) ప్రపంచం చూస్తుంది. అనారోగ్యంతో బాధపడుతున్నట్టు నటించడం, క్లాసులకు బంక్ కొట్టి అమ్మానాన్నలను మోసం చేయడం, అల్లరి చేయడం యాక్టర్ గా ఎదగడం చూశాను.
పూజూ ఇది నీ కోసం.. నువ్వు ఒక పాత్ర చేస్తే ఎంత ఆనందమో.. ప్రేక్షకులు కురిపించే ప్రేమ కూడా అంతే వ్యసనపరుస్తుంది. నువ్వు ఈ జర్నీని ఆస్వాదించాలని, ప్రతి అనుభవంతో మెరుగైన వ్యక్తిగా మారాలని కోరుకుంటున్నా..మీ గర్వించదగిన సోదరి అంటూ క్యాప్షన్ ఇచ్చింది సాయిపల్లవి. సోదరి పూజాకన్నన్ పై సాయిపల్లవి రాసుకొచ్చిన ఈ సందేశం ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ సముద్రఖని ప్రధాన పాత్రలో నటించాడు. పూజాకన్నన్ ఐదేండ్ల క్రితం ఓ షార్ట్ ఫిలిమ్‌లో కూడా నటించింది.
ఇవి కూడా చదవండి..
Rashmika Preperation | తిరుపతిలోని ఓ గ్రామానికి వెళ్లిన రష్మిక..ఎందుకో తెలుసా..?
AKhanda Like Mass Jathara |మాస్ జాతరలా ‘అఖండ’..ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టే
Tara Sorry to Payal Rajput | ఆర్ఎక్స్ 100 భామకు తడప్ హీరోయిన్ క్షమాపణలు
Unstoppable Crazy update | నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్..నిజమెంత..?
Ram Charan in mountains | రాంచరణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా..?