Itlu Maredumilli prajaneekam Movie | సినీయర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు అల్లరి నరేష్. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా పేరు తెచ్చుకున్న నరేష్.. గతేడాది ‘నాంది’తో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. గతే కొన్నేళ్ళుగా కామెడీ సినిమాలు చేస్తూ వస్తున్న నరేష్ ‘నాంది’ చిత్రంతో తన పంథాను మార్చుకుని ‘నేను’ తర్వాత పూర్తి స్థాయి సీరియస్ రోల్ ఈ చిత్రంలో పోషించాడు. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు అదే జోష్‌తో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.
ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. కాగా ఈ చిత్రాన్ని ముందుగా నవంబర్ 11న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అయితే ఈ చిత్రం రెండు వారాలు పోస్ట్ పోన్ కానున్నట్లు తెలుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేవని టాలీవుడ్ వర్గాల సమాచారం. దాంతో ఈ చిత్రాన్ని నవంబర్ 25కు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు టాక్. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే చాన్స్ ఉంది.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఎలక్షన్ అధికారిగా కనిపించనున్నాడు. నరేష్‌కు జోడీగా ‘శ్రీదేవీ సోడా సెంటర్’ ఫేం ఆనంది హీరోయిన్గా నటిస్తుంది. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Read Also:
PS-2 | ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్-2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
Ram Charan-Sukumar | ‘రంగస్థలం’ కాంబో రిపీట్ కానుందా?
టెలివిజన్‌లో ‘ఆచార్య’ షాకింగ్ టీఆర్పీ.. ఆ సీనియర్ హీరోల దగ్గరకు కూడా రాలేకపోయిన చిరు..!