టెలివిజన్‌లో ‘ఆచార్య’ షాకింగ్ టీఆర్పీ.. ఆ సీనియర్ హీరోల దగ్గరకు కూడా రాలేకపోయిన చిరు..!
Acharya Movie | ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్లాప్‌లలో 'ఆచార్య' ఒకటి. చిరంజీవి, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజు నుండి నెగెటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది.
Acharya Movie | ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్లాప్‌లలో ‘ఆచార్య’ ఒకటి. చిరంజీవి, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజు నుండి నెగెటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించిన రెండో రోజు నుండి కనీసం థియేటర్ రెంట్‌కు సరిపడ కలెక్షన్లు కూడా సాధించలేకపోయింది. అపజయమే ఎరుగని కొరటాలకు ఈ చిత్రం మొదటి ఫ్లాప్‌గా మిగిలింది. కొరటాల మార్క్ సినిమాలో ఎక్కడా కూడా కనిపించదు. ఈ సినిమా ఫలితంతో చిరు-చరణ్‌లు తీవ్రంగా నిరాశపడ్డారు. అయితే ఈ చిత్రం వెండితెరపైనే కాదు బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకోలేకపోయింది.
ఆచార్య సినిమా ఇటీవలే జెమెని టీవీలో ప్రదర్శితమైన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం 6.3 టీఆర్పీ రేటింగ్‌ను నమోదు చేసింది. అయితే రీ ఎంట్రీ తర్వాత చిరు నటించిన సినిమల్లో ఇదే అత్యల్పం. అంతేకాకుండా ఇటీవలే వచ్చిన నాగార్జున ‘బంగార్రాజు’, బాలయ్య ‘అఖండ’, వెంకటేష్ ‘ఎఫ్-3’ వంటి సీనియర్ హీరోల సినిమా టీఆర్పీ రేటింగ్‌కు చిరంజీవి దగ్గరలో కూడా రాలేకపోయాడు. వెండితెరపైనే కాదు, బుల్లితెరపై కూడా ఈ చిత్రం విజయం సాధించలేకపోయింది. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో రామ్‌చరణ్ సిద్ద పాత్రలో నటించాడు. చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. మ్యాట్నీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చరణ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

