Ram Charan-Sukumar | ‘రంగస్థలం’ కాంబో రిపీట్ కానుందా?
కొన్ని సినిమాలకు ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదూ. ఎన్ని సార్లు చూసినా కొత్తగా చూస్తున్నట్లే ఫీలై పోతుంటాం. అలాంటి సినిమాల్లో 'రంగస్థలం' ఒకటి. 2018లో రిలీజైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.
Ram Charan-Sukumar Combo | కొన్ని సినిమాలకు ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదూ. ఎన్ని సార్లు చూసినా కొత్తగా చూస్తున్నట్లే ఫీలై పోతుంటాం. అలాంటి సినిమాల్లో ‘రంగస్థలం’ ఒకటి. 2018లో రిలీజైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం అటు రామ్‌చరణ్‌కు, ఇటు సుకుమార్‌కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమాతో రామ్‌చరణ్, తన నటనపై వస్తున్న విమర్శలకు బ్రేక్ వేశాడు. చిట్టిబాబు పాత్రలో చరణ్ నటించాడు అనడం కంటే జీవించాడు అనడం సబబు. ఇక సుకుమార్ టేకింగ్, విజన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రం రూ.216 కోట్ల కలెక్షన్లను సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ కాంబోలో మరో సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా మెగా ఫ్యాన్స్ కోరిక నిజమయ్యేలానే ఉంది.
రామ్‌చరణ్- సుకుమార్ కాంబోలో మరో సినిమా ఉండన్నుట్లు తెలుస్తుంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రకటించాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇంట్రో సీన్‌ను సకుమార్ ఇప్పటికే షూట్ చేశాడట. ఆర్ఆర్ఆర్ షూటింగ్ స్టార్ట్ అవకముందే చరణ్‌తో పవర్ ఫుల్ ఇంట్రోను షూట్ చేశాడట. ఈ వార్తతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ప్రస్తుతం సుకుమార్ బన్నీతో ‘పుష్ప’ సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత విజయ్‌తో సినిమా చేయనున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్‌ల తర్వాతే రామ్‌చరణ్‌తో రెండో సినిమా చేయనున్నట్లు టాక్.
ఆర్ఆర్ఆర్తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘RC15’ చేస్తున్నాడు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపకుంటుంది. ఈ చిత్రం సెట్స్‌పైన ఉండగానే రామ్‌చరణ్ తన 16వ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా ప్రారంభించాడు. అయితే చరణ్.. తన 16వ సినిమాకు సుకుమార్‌ను కూడా అనుకుంటున్నట్లు టాక్. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

